Mokshagna Teja: హీరో కొడుకు హీరో కావాల్సిందే.. అది కాదనలేని నియమం. ఇక తరాల నుండి పరిశ్రమలో పాతుకుపోయిన కుటుంబాల వారసుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాను దశాబ్దాల పాటు ఏలిన నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. తన కుమారుడిని హీరో చేయాలన్న ఆలోచన మొదటి నుండి ఎన్టీఆర్ మదిలో ఉంది. అందుకే బాల నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఇక ఎన్టీఆర్ కుమారుల్లో బాలకృష్ణ, హరికృష్ణ నటులుగా రాణించారు.
మూడో తరం నటవారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. కళ్యాణ్ రామ్ పర్లేదు అనిపించుకున్నారు. స్టార్డం సొంతం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీనేజ్ లోనే సంచలనాలు చేశారు. ఇరవై ఏళ్లకే జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న నటుడు. కాగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరో కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. నందమూరి డై హార్డ్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యమైంది.
30 ఏళ్ల ప్రాయంలో ఉన్న మోక్షజ్ఞ ఎట్టకేలకు నటుడు అయ్యేందుకు సమ్మతం తెలిపాడు. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో మోక్షజ్ఞ నటించాల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా జరిగాక ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిందని అంటున్నారు. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో పాటు యాటిట్యూడ్ చూపిస్తున్న ప్రశాంత్ వర్మ తీరు పట్ల బాలకృష్ణ అసహనంగా ఉన్నాడట. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ పుకార్లే అంటూ నిర్మాతలు కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.
వాస్తవం ఏదైనా కానీ… బాలయ్య ఫ్యాన్స్ కి కూడా ప్రశాంత్ వర్మ మీద నమ్మకం పోయిందట. మాస్ మసాలా సబ్జెక్స్ తో చిత్రాలు చేసే కమర్షియల్ డైరెక్టర్ తో మోక్షజ్ఞను లాంచ్ చేయాలని వారు కోరుతున్నారట. ప్రశాంత్ వర్మ మాకొద్దు అంటున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరోవైపు బాలకృష్ణతో ఎన్టీఆర్ కి విబేధాలు ఉన్నాయనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. ఇందుకు అనేక పరిణామాలు కారణమయ్యాయి. బాలయ్య హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షోకి ఇంత వరకు ఎన్టీఆర్ రాలేదు. అలాగే షోకి వచ్చిన గెస్ట్స్ వద్ద బాలయ్య ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం లేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞకు పోటీగా ఎన్టీఆర్ తన అన్న జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్(ఆయన పేరు కూడా ఎన్టీఆరే) ని పరిచయం చేస్తున్నాడట.