PM Modi: ప్రధాని మోదీ ( Narendra Modi) ఈరోజు విశాఖ రానున్నారు. రెండు లక్షల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోడీ పర్యటన దృష్ట్యా పాఠశాలలకు సెలవు( holiday) ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్( gvmc) పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ మూతపడనున్నాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. నగరంలో బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు ఈరోజు సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు విద్యాసంస్థలను తెరవాలని పాఠశాల యాజమాన్యాలకు అధికారులు సూచించారు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా 2 లక్షల కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ముందుగా నగరంలో రోడ్ షో( Roadshow ) నిర్వహిస్తారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు( Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పాల్గొంటారు.
* భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో( AU Engineering College Ground ) భారీ బహిరంగ సభ జరగనుంది. ఉత్తరాంధ్ర నుంచి 2 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సులను సైతం నడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు విశాఖలో ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో( INS dega ) ప్రత్యేక విమానంలో దిగనున్నారు ప్రధాని మోదీ. అక్కడ నుంచి రోడ్ షో గా బయలుదేరనున్నారు. విశాఖ నగరంలోని ప్రధాన జంక్షన్ లను కలుపుతూ ఈ రోడ్ షో ఉంటుంది. ప్రధాని మోదీ పక్కనే సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు సభా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అనంతరం ప్రత్యేక విమానంలో( special flight) మోడీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు.
* కేంద్ర బలగాల మొహరింపు
ప్రధాని పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు( Central force) మోహరించాయి. ఏపీ పోలీసులు సైతం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో విశాఖ నగరం భద్రత వలయంలో ఉంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బస్సులను జనాల తరలింపుకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం భావించింది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో విద్యాసంస్థలు ఈరోజు మూతపడనున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే అధికారులు ప్రకటించారు. ప్రధాని పర్యటన, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
* విశాఖలో రద్దీ
ఒకవైపు సంక్రాంతి పండుగ( Pongal festival ), మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో రద్దీ నెలకొంది. ఇప్పటికే రైల్వే శాఖ( railway department) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆర్టీసీ సైతం ప్రత్యేక సర్వీసులను తిప్పుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా విశాఖలో రైలు దిగి స్వగ్రామాలకు చేరుతారు. దీంతో ఇలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు విశాఖ రైల్వే స్టేషన్ లో దిగుతుండడంతో రద్దీగా మారింది. అడుగు తీసి అడుగు వేయనంతగా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి తరుణంలోనే ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.