https://oktelugu.com/

Ram Charan : నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే : రామ్ చరణ్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 10:32 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఏంటి ఇచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన సినిమాలతో మంచి విజయాలను అందుకొని అంతకు మించిన సక్సెస్ లను సాధిస్తు ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు…

    మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటికే ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈనెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతి విన్నర్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని భారీగా ప్రమోట్ అయితే చేస్తున్నాడు. ఇక శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ శంకర్ కూడా పూర్తి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేయడంతో యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిలో ఈ సినిమా మీద మంచి అంచనలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న రామ్ చరణ్ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని సీక్రెట్లను బాలయ్య బాబుతో పంచుకున్నారు.

    ఇక ఈ షోలో రామ్ చరణ్ బాగా ఫీల్ అయిపోతూ తను ఒక భారీ తప్పు చేశానని చెప్పాడు. అది ఏంటి అంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమాని రీమేక్ చేసి తప్పు చేశానని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా రోజుల పాటు ఆ డిప్రెషన్ లో ఉన్నానని కూడా తెలియజేశాడు.

    ఇక మొత్తానికైతే జంజీర్ లాంటి ఒక క్లాసికల్ సినిమాని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పు కానీ రామ్ చరణ్ తనే స్వయంగా అలాంటి తప్పు చేసినందుకు రిగ్రేరేట్ అవుతున్నానని చెప్పడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా అప్పుడు ఆ సినిమా ద్వారా భారీ విమర్శలను ఎదుర్కొన్న రామ్ చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హైట్ అందుకున్నాడు.

    ఇక ఆ సినిమా అందించిన విజయంతో ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో రామ్ చరణ్ చాలావరకు కృషి చేశారనే చెప్పాలి… ఇక ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోసారి తన నటనతో విజృంభించినట్టుగా తెలుస్తోంది…