https://oktelugu.com/

Devara: నవంబర్ 14న ‘దేవర’ ఫేర్ వెల్ షోస్ ప్లాన్ చేసిన అభిమానులు..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కి 'సింహాద్రి', 'ఆది', 'యమదొంగ' తర్వాత థియేట్రికల్ పరంగా బెస్ట్ రన్ వచ్చింది 'దేవర' చిత్రానికే. ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, 50 రోజుల వేడుకలు ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 01:26 PM IST

    Devara collections

    Follow us on

    Devara: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం విడుదలై నవంబర్ 14వ తేదీతో 50 రోజులు పూర్తి అవ్వబోతుంది. ఈ 50 రోజుల్లో ఈ సినిమా సాధించిన రికార్డులు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ రెండవ రోజు నుండి టాక్ మెరుగుపడడంతో నెల రోజుల వరకు నాన్ స్టాప్ గా థియేట్రికల్ షేర్స్ ఈ సినిమాకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఉండే థియేటర్స్ కి ‘దేవర’ కారణంగా పూర్వ వైభవం వచ్చింది. మూసేసిన థియేటర్స్ ని కూడా మళ్ళీ తెరిపించింది దేవర. అలా ఒక్కటా రెండా ఈ సినిమా ఖాతాలో ఎన్నో లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కి ‘సింహాద్రి’, ‘ఆది’, ‘యమదొంగ’ తర్వాత థియేట్రికల్ పరంగా బెస్ట్ రన్ వచ్చింది ‘దేవర’ చిత్రానికే. ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, 50 రోజుల వేడుకలు ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు.

    ఈ సందర్భంగా నవంబర్ 14న ‘దేవర’ ఆడుతున్న థియేటర్స్ లో ‘ఫేర్ వెల్’ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్స్ లో ఈ సినిమా అర్థ శత దినోత్సవం జరుపుకోనుంది. సెకండ్ షోస్ అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే పలు మెయిన్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయట. కేవలం ఆ ఒక్క రోజే 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ అభిమానులు చరిత్ర తిరగరాసిన వాళ్ళు అవుతారు. ఈ ఓటీటీ కాలంలో ఒక సినిమా సరిగ్గా థియేటర్స్ లో రెండు మూడు వారాలు ఆడడమే ఎక్కువ. అలాంటిది వంద కి పైగా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఎన్టీఆర్ కి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే ఎలా ఉంటుందో చెప్పడానికి దేవర ఒక నిదర్శనం.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం ప్రస్తుతానికి ఆపారు. #RRR హిందీ వెర్షన్ కి గ్లోబల్ వైడ్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ‘దేవర’ హిందీ వెర్షన్ కి డిమాండ్ విపరీతంగా ఉందట. నెట్ ఫ్లిక్స్ సంస్థతో పాటు హాట్ స్టార్ సంస్థ కూడా దేవర హిందీ రైట్స్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే ప్రస్తుతానికి హిందీ వెర్షన్ తప్ప, అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.