https://oktelugu.com/

Ram Gopal Varma: వేట మొదలైంది.. రాంగోపాల్ వర్మకు ఉచ్చు బిగిసింది.. కేసు నమోదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు అయ్యింది. గత ఐదేళ్లలో ఆర్జీవి టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా చాలా రకాలుగా పోస్టులు పెట్టారు. అందులో అత్యంత వివాదాస్పదం అయినవి కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 11, 2024 1:35 pm
    Ram Gopal Varma

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma: ఏపీలో మరో రాజకీయ పరిణామం. ఇప్పటికే వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన సోషల్ మీడియా ప్రతినిధుల పై కేసులు నమోదు అవుతున్నాయి. కొందరి అరెస్టులు కూడా జరుగుతున్నాయి.గతంలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో తాజాగా కేసులు నమోదవుతున్నాయి.ఈ ఫిర్యాదులు ఆధారంగా వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న సోషల్ మీడియా యాక్టివిటీలపై చర్యలకు దిగుతున్నారు పోలీసులు.కడప జిల్లాలోఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి ల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.మరోవైపు పలువురు యూట్యూబర్లు సైతం అరెస్టయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సైతం నమోదు కావడం విశేషం. రాంగోపాల్ వర్మ జగన్ తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. గత ఐదేళ్ల కాలంలో చాలా రకాల సినిమాలు వైసీపీకి అనుకూలంగా తీశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, ప్రతి వ్యూహం అంటూ చాలా రకాల చిత్రాలను తీసిన సంగతి తెలిసిందే. అటు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై సైతం విరుచుకుపడేవారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్స్ పుణ్యమా అని రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం విశేషం.

    * కొద్ది రోజులుగా సైలెంట్
    వైసీపీ అధినేత జగన్ రాజకీయ నేపధ్యాన్ని వ్యూహం, సిద్ధం పేరుతో సినిమాలను రాంగోపాల్ వర్మ తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లోన్యాయచిక్కులు రావడంతో ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మ జగన్ కు చాలా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా, జగన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అదే క్రమంలో చంద్రబాబు, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. అప్పట్లో జన సైనికులకు సైతం వ్యతిరేకంగా కామెంట్స్ రాంగోపాల్ వర్మ నుంచి వచ్చేవి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు. ఇటీవల వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టులు కొనసాగుతున్న తరుణంలో.. రాంగోపాల్ వర్మ పరిస్థితి ఏంటి అన్నది చర్చకు దారితీసింది.

    * ప్రకాశం జిల్లాలో కేసు
    అయితే ఈరోజు అనూహ్యంగా ప్రకాశం జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఓ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ అప్పట్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై ప్రకాశం జిల్లామద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు రామ్ గోపాల్ వర్మపై. ఇప్పటివరకు వైసీపీ సామాన్య సోషల్ మీడియా ప్రతినిధులను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలు గా ఉన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వారిపై పడడంతో.. ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతోంది. వేట మొదలు పెట్టినట్లు అయ్యింది.