Urvasivo Rakshasivo Collections: అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత హీరో గా మన ముందుకి వచ్చిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’..అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా రాకేష్ శశి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది..కానీ ఆ టాక్ కి తగ్గట్టుగా కలెక్షన్స్ లేవు..విడుదలకి ముందు టీజర్ మరియు ట్రైలర్ బాగున్నప్పటికీ కూడా కనీసం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది..సునీల్ మరియు వెన్నెల కిషోర్ తమ అద్భుతమైన వింటేజ్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా రాణించినప్పటికీ జనాలు ఈ సినిమా మీద ఆసక్తి చూపించలేదు..ఇప్పటి వరుకు విడుదలై 12 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపుగా క్లోసింగ్ కి దగ్గరగా వచ్చేసింది..మంచి టాక్ తెచ్చుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ సినిమాకి వసూళ్లు రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒక లుక్ వేద్దాం.

ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 0.97 కోట్లు
సీడెడ్ 0.33 కోట్లు
ఉత్తరాంధ్ర 0.42 కోట్లు
ఈస్ట్ 0.23 కోట్లు
వెస్ట్ 0.14 కోట్లు
నెల్లూరు 0.12 కోట్లు
గుంటూరు 0.21 కోట్లు
కృష్ణ 0.22 కోట్లు
మొత్తం 2.61 కోట్లు
వరల్డ్ వైడ్ 3.00 కోట్లు
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు జరిగింది..అల్లు శిరీష్ మార్కెట్ రేంజ్ కి ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి..అందుకే నష్టాలు కూడా భారీగా వచ్చాయి..సుమారు మూడు కోట్ల రూపాయిల నష్టాలను చవిచూసిన ఈ చిత్రం అల్లు శిరీష్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది..ప్రేక్షకులు కొంతమంది హీరోల సినిమాలను థియేటర్ లో చూడడం పూర్తి గా మానేశారు..వారిలో అల్లు శిరీష్ కూడా ఒకరు..ఎందుకో ఆయనకీ టికెట్ రేట్ పెట్టి తమ సమయాన్ని వెచ్చించి థియేటర్స్ లో చూడాలి అనిపించలేదు ప్రేక్షకులకు..OTT స్ట్రీమింగ్ కోసం వాళ్లంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

లాక్ డౌన్ సమయం లో OTT కి ప్రేక్షకులు బాగా అలవాటు పడడం వల్ల కొంతమంది హీరోల సినీ కెరీర్ మనుగడ చాలా కష్టం అయిపోయింది..అలా నష్టపోయిన కెరీర్స్ లో అల్లు శిరీష్ కూడా ఒకటి..ఇక నుండి ఈయన తన సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కంటే OTT లో విడుదల చేసుకోవడం మంచిదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.