Prabhas : ప్రభాస్(Rebel Star Prabhas) వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నప్పటికీ, అభిమానుల్లో ఆయన నుండి కొన్ని అసంతృప్తికి గురి చేసే అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంశం, ఆయన లుక్స్. బాహుబలి సమయంలో ప్రభాస్ లుక్స్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో అంటే ఇలాగే ఉండాలి రా అనే రేంజ్ లో ఆయన లుక్స్ ఉండేవి. అందమైన ముఖంతో పాటు, హాలీవుడ్ యాక్షన్ హీరో రేంజ్ కటౌట్ ఆయన సొంతం. అయితే బాహుబలి తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖం లో ఒకప్పుడు ఉన్నటువంటి గ్లో ఇప్పుడు లేదు. కళ్ళు లోపలకు వెళ్లిపోయాయి, ముక్కు చాలా పెద్దది గా కనిపిస్తుంది, ఇలా ఎన్నో రకాల కంప్లైంట్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా ఆయన లుక్స్ చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ షూటింగ్ సెట్స్ లో ఉన్నాడు. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. కాళ్ళకు దెబ్బలు తగలడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ కి దూరంగా ఉండాలని డాక్టర్లకు ఇచ్చిన సలహా మేరకు, ఆయన చాలా కాలం నుండి యూరోప్ లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎట్టకేలకు రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రభాస్ ని కలిసి తమ ఊరిలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ప్రభాస్ ని ఆహ్వానించడానికి వెళ్ళాడు. ఆయన ఆహ్వాన పత్రిక అందిస్తూ ఫోటో కి ఫోజులు ఇవ్వగా అవి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
అందులో ప్రభాస్ లుక్స్ ని చూసిన అభిమానులు, బుజ్జిగాడు సినిమా సమయంలో ప్రభాస్ ఎలాంటి లుక్స్ తో ఉండేవాడో, ఇప్పుడు కూడా అదే రేంజ్ లుక్స్ తో ఉన్నాడని కామెంట్స్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇన్ని రోజులు దురాభిమానుల ప్రభాస్ లుక్స్ పై అనేక కామెంట్స్ చేసేవారు, ఇప్పుడేమంటారు? అంటూ నిలదీస్తున్నారు. ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో విడుదలకు దగ్గరగా ఉన్న చిత్రం ‘రాజా సాబ్’. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 న విడుదల కావాల్సింది. కానీ చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడింది. దసరా కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.