https://oktelugu.com/

Family Star vs Tillu Square: ఫ్యామిలీ స్టార్ వర్సెస్ టిల్లు స్క్వేర్ పోటీ లో గెలిచిందేవరు..?

విజయ్ టాప్ హీరో రేంజ్ కి దూసుకుపోయాడు. అయినప్పటికీ ఆయన ఓవర్ ఆటిట్యూడ్ వల్ల జనాల్లో ఆయనకు వ్యతిరేకత ఎక్కువగా మొదలైంది. దానివల్లే ఆయన సినిమాల్ని ఆదరించే జనాలు కరువయ్యారు.

Written By: , Updated On : April 10, 2024 / 05:27 PM IST
Family Star vs Tillu Square

Family Star vs Tillu Square

Follow us on

Family Star vs Tillu Square: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన “పెళ్లి చూపులు” సినిమాతో సోలో హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలు కమిట్ అవుతూ మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత “గీత గోవిందం” అనే సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ టాప్ హీరో రేంజ్ కి దూసుకుపోయాడు. అయినప్పటికీ ఆయన ఓవర్ ఆటిట్యూడ్ వల్ల జనాల్లో ఆయనకు వ్యతిరేకత ఎక్కువగా మొదలైంది. దానివల్లే ఆయన సినిమాల్ని ఆదరించే జనాలు కరువయ్యారు.

ఇక ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన “ఫ్యామిలీ స్టార్” సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్ కి ఒక వారం ముందు రిలీజ్ అయిన “డీజే టిల్లు స్క్వేర్” సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరో కావడం విశేషం.. ఇక తను టిల్లు పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా ఆయన యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలని కంపేర్ చేస్తూ సోషల్ మీడియా లో చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక మీదటైనా విజయ్ దేవరకొండ సక్రమంగా సినిమాలు చేసుకుంటే మంచిది. అలా కాకుండా స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఊగిపోయి మాట్లాడడం కాంట్రవర్సీ కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా బిహేవియర్ బాగాలేకపోతే సినిమా అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా, జనాల్లో నెగిటివిటీ ఎక్కువ గా పెరిగిపోతుంది. అంటు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం డీజే టిల్లుగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఫ్యూచర్ లో స్టార్ హీరో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే విజయ్ లాంటి ఒక స్టార్ హీరో ముందు సిద్దు జొన్నలగడ్డ సక్సెస్ ఫుల్ సినిమాను తీసి 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక వీళ్లిద్దరి పోటీలో సిద్దు విజయం సాధించాడని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…