Guntagalagara: మన దేశంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్కల గురించి చాలా మందికి తెలియదు. కానీ తెలిసిన వారు మాత్రం ఉపయోగిస్తుంటారు. ఇక నాటు వైద్యం, ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య పద్దతుల్లో ఈ మొక్కలనే ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది గుంటగలగర మొక్క. పొలం గట్టున, నీటి కాలువల పక్కన ఉండే ఈ మొక్కకు చిన్నగా తెల్లని పూలు వస్తాయి. దీన్ని భృంగరాజ్ అని పిలుస్తారు కూడా.
ఈ ఆకులతో తయారు చేసిన నూనెతో జుట్టు రాలడం అరికట్టవచ్చు. ఒత్తుగా, నల్లగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ మొక్క. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు రసం మొఖం ముడతలకు, మచ్చలకు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నూనెలతో కలిపి పొడిగా చేసి చర్మ వ్యాధులు, అలెర్జీలకు చికిత్సగా ఉపయోగించవచ్చును. అందుకే ఈ ఆకులకు, పొడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. శరీరం మొత్తానికి ఈ ఆకు మేలు చేస్తుంది.
కాలేయం.. గుంటగలగర ఆకు లివర్ టానిక్ గా పనిచేయడంలో ముందుంటుంది. కాలేయ సంబంధిత సమస్యలను కూడా పోగొడుతుంది ఈ ఆకు. కాలేయ వ్యాపు, పచ్చకామెర్లు, ఫ్యాటీ లివర్ వ్యాధులను నయం చేస్తుంది. ఆకలి కూడా పెంచుతుంది.
రోగనిరోధక శక్తి..ఈ ఆకును మూడు నుంచి నాలుగు నెలల పాటు తింటే రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది. తేలికపాటి ఆహారం తిన్న తర్వాత రెండు సార్లు ప్రతి రోజు తినాలి. ఒక టీస్పూన్ భృంగరాజ్ చూర్ణాన్ని ఒక గ్లాసు పాలతో కలిపి సేవించవచ్చు. చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ ఆకు నూనెను రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది