https://oktelugu.com/

Ramcharan-shankar movie: రాంచరణ్ తో అల్లు అర్జున్ ‘విలన్’?

ఏ ముహూర్తాన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో విలన్ గా ఎంపికయ్యాడో కానీ ఈ మలయాళ విలక్షణ నటుడు నక్కతోక తొక్కినట్టే ఉన్నాడు. బన్నీ ‘పుష్ప’ మూవీకి రూ.5 కోట్లలోపు పారితోషికం అందుకుంటున్న ఫహద్ ఫాజిల్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.. రాంచరణ్-శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా ఇప్పుడు ఫహద్ ఫాజిల్ పేరు వినిపిస్తోంది. శంకర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2021 / 11:42 AM IST
    Follow us on

    ఏ ముహూర్తాన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో విలన్ గా ఎంపికయ్యాడో కానీ ఈ మలయాళ విలక్షణ నటుడు నక్కతోక తొక్కినట్టే ఉన్నాడు. బన్నీ ‘పుష్ప’ మూవీకి రూ.5 కోట్లలోపు పారితోషికం అందుకుంటున్న ఫహద్ ఫాజిల్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట..

    రాంచరణ్-శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా ఇప్పుడు ఫహద్ ఫాజిల్ పేరు వినిపిస్తోంది. శంకర్ సినిమాల్లో విలన్ పాత్రలు హీరోను మించి ఉంటాయి. అందుకే ఈ బలమైన క్యారెక్టర్ లో ఫాజిల్ ను నటింపచేయాలని చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోందట..

    శంకర్ కథలో హీరో రాంచరణ్ తో విలన్ పాత్ర ఢీ అంటే ఢీ అనేలా ఉంటుదట.. వీరిద్దరి మధ్య జరిగే డ్రామానే కథకు కీలకమట.. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. ఫాజిల్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని అంటున్నారు.

    ఫాజిల్ ను శంకర్ -రాంచరణ్ సినిమాలో నటింపచేయడానికి చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోందని ఆయన కాల్షీట్లు అడ్జస్ట్ అయితే వెంటనే అధికారికంగా పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.

    రాంచరణ్-శంకర్ మూవీలో ఒక హీరోయిన్ గా కియారీ అద్వానీ ఎంపికకాగా.. రెండో హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టు తెలిసింది.