Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది.ఇంతకుముందు సూపర్ సక్సెస్ అయిన చాలామంది హీరోలు వరుస ఆఫర్లను దక్కించుకొని ఇండస్ట్రీలో సూపర్ హిట్లను సాధిస్తున్నారు. ఇక మరి కొంతమంది యంగ్ హీరోలు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ప్రస్తుతం వాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టు గా కానీ, విలన్లుగా కానీ మారి సినిమాలను చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే బ్రహ్మానందం కొడుకు అయిన గౌతమ్ రెండు, మూడు సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆయన హీరోగా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక దానివల్లే నాగచైతన్య హీరోగా వచ్చిన దూత సిరీస్ లో నటించి మెప్పించాడు. ఆయన నటనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే… ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి సినిమాలు చేస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన నా సామి రంగా సినిమాలో వీళ్ళిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం విశేషం. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలు వస్తే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. లేదంటే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని, విలన్లు గా గాని మారిపోయి వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాలో బిజీగా ఉంటున్నారు. మొత్తానికైతే సినిమాలో ఉండాలి అనేవాళ్ళ ఆశ నెరవేరినట్టు అవుతుంది. అందుకోసమే హీరో అనే కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏది ఉన్నా కూడా మన నటులు నటించి మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ ఇలాంటి కొత్త పుంతలు తొక్కడం అనేది కొంతవరకు మంచి పరిణామం అనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే స్టార్ హీరోలు ఎలాగైతే సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారో యంగ్ హీరోలు కూడా వాళ్లను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మరి కొంత మంది హీరోలు అయితే మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకమీదట చాలామంది యంగ్ హీరోలు కూడా విలన్లుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి…