F3 OTT Release Date: F3 OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

F3 OTT Release Date: విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో,ప్రముఖ దర్సకుడు అనిల్ రావి పూడి దర్శకత్వం లో తమ్మన్న మరియు మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్స్ గా నటించిన F3 చిత్రం ఇటీవలే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తనదైన మార్కు కామెడీ టైమింగ్ తో అనిల్ రావిపూడి మరోసారి ఈ సినిమా ద్వారా ఫామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి క్యూ కట్టేలా చేసాడు..కథ […]

Written By: Neelambaram, Updated On : June 3, 2022 3:26 pm

F3 OTT Release Date

Follow us on

F3 OTT Release Date: విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో,ప్రముఖ దర్సకుడు అనిల్ రావి పూడి దర్శకత్వం లో తమ్మన్న మరియు మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్స్ గా నటించిన F3 చిత్రం ఇటీవలే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తనదైన మార్కు కామెడీ టైమింగ్ తో అనిల్ రావిపూడి మరోసారి ఈ సినిమా ద్వారా ఫామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి క్యూ కట్టేలా చేసాడు..కథ పరంగా పెద్దగా ఏమి లేకపోయినప్పటికీ కామెడీ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బంపర్ హిట్ కొట్టిన F2 కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడం తో ఈ మూవీ కి బంపర్ ఓపెనింగ్ దక్కింది..తోలి రోజే ఈ సినిమాకి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా ఫామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపొయ్యేలా చేసిన ఈ సినిమా మూడు రోజులకి కలిపి దాదాపుగా 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది.

F3

Also Read: First Three Days Collections: తొలి 3 రోజుల కలెక్షన్లు.. ‘ఎఫ్3’, ‘సర్కారువారి పాట’ల్లో దేనికి ఎక్కువచ్చాయంటే?

ఇక తొలి సోమవారం కూడా ఈ సినిమా వసూళ్లు డీసెంట్ ఆక్యుపెన్సీస్ తో ప్రారంభం అయ్యాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఈ సినిమా లాంగ్ రన్ లో కూడా కుమ్మేసేట్టు ఉంది..ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో ఒక్క సినిమా విడుదల అయితే నాలుగు వారాలు పూర్తి చేసుకోగానే OTT లో విడుదల చేసేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అలాగే F 3 కూడా జూన్ 25 వ తారీఖున OTT లో విడుదల చెయ్యబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది..ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లైవ్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసారు..దిల్ రాజు వారితో ఈ సినిమా OTT లో నాలుగు వారాల తర్వాతనే విడుదల చేసునేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు అట..ఒక్కవేల కలెక్షన్స్ రెండవ వారం నుండి తగ్గుముఖం పడితే మూడు వారల తర్వాత కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది..థియేటర్స్ లో కుమ్మేస్తున్న ఈ సినిమా OTT లో ఏ రేంజ్ అలరిస్తుందో చూడాలి.

Also Read: Dasari Narayana Rao: ఎందర్నో హీరోలను చేశాడు.. కానీ, ఏ హీరో ఆయనను పట్టించుకోలేదు

Recomended Videos


Tags