Caste Conspiracy Against Mahesh Babu: రాజకీయాల్ని, సినిమాల్ని సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందా ?, అసలు చేయగలదా ?, భిన్నమైన వాదనలు వినిపించవచ్చు. కానీ, ఒక్కటి మాత్రం నిజం. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు ?, ఒక్కోసారి సోషల్ మీడియాలో నిజం కనిపించకపోవచ్చు. అంతెందుకు.. సోషల్ మీడియాలో కాస్త డబ్బులు ఖర్చు చేస్తే, హీరోని జీరోగా చూపించొచ్చు. ప్లాప్ హీరోకి స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ను చూపించొచ్చు. అందుకే, ఎన్నో జిమ్మిక్కులు ఉన్న సోషల్ మీడియా అంటే.. స్టార్ హీరోలకు కూడా భయమే.

‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా విడుదల ఖరారైనప్పటి నుంచి, మహేష్ బాబు మీద పనిగట్టుకుని కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేశారు. తరచి చూస్తే అన్నీ పెయిడ్ ట్వీట్లే, పెయిడ్ కామెంట్లే. అసలు సినిమా హిట్టా.? ఫట్టా.? అన్నది వేరే చర్చ. సర్కారు వారి పాట సినిమా వచ్చి పోయాక కూడా ఈ నెగెటివిటీ ఆగడంలేదు.
Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష్ కుమ్మేశాడు !
మహేష్ ను కొత్తగా ఓ సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారు కొందరు. దానికి తోడు ఇన్నాళ్లు కమ్మని సామాజిక వర్గం కూడా, మహేష్ ను ఓన్ చేసుకోలేదు. కానీ.. కొత్తగా మహేష్ తమ వాడు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అదే సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారితోనూ మహేష్ మా వాడే అంటూ పోస్టింగులు పెట్టిస్తున్నారు. ఇదంతా ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్ తరహాలో నడుస్తోంది సోషల్ మీడియాలో.

ఎందుకు ? ఇదంతా ?, కారణం ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మహేష్ బాబును ‘కమ్మ’ని పార్టీకి మద్దతుగా వ్యవహరించాలని ఆ సామాజిక వర్గం ఆశ పడుతుంది. ప్రయత్నాలు చేస్తోంది. మరో సామాజిక వర్గానికి చెందిన కొందరిలో ఈ ఆందోళన బయల్దేరింది. అదే ఇప్పుడు అసలు సమస్య అయ్యింది. మహేష్ ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకోవాలని, ఎప్పటి నుంచో కమ్మని సామాజిక వర్గం ప్లాన్స్ గీస్తోంది.
ఆ ప్రయత్నంలో భాగంగా మహేష్ పై కుల ముద్ర వేస్తోంది. ‘నేను రాజకీయాల్లోకి రాను మొర్రో..’ అని మహేష్ ఇప్పటికే మొర పెట్టుకున్నా.. ఆ వర్గం మాత్రం వదలడం లేదు. మహేష్ ను రాజకీయ వివాదాల్లోకి లాగేందుకు ఆ రెండు వర్గాలు ప్రయత్నిస్తున్న వైనం మహేష్ ను కూడా విస్మయానికి గురి చేస్తోంది. మరి ఎన్నికల నాటికీ ఎన్ని నాటకీయ కోణాలు జరుగుతాయో చూడాలి.
Also Read: AP Sachivalayam Employees: 50 వేల మందికే ప్రొబేషన్.. సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు షాక్


