Dasari Narayana Rao: దర్శకుడు అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన గొప్ప మనసు ఉన్న వ్యక్తి దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. నేడు ఆ దర్శక దిగ్గజం పంచమ వర్ధంతి. తెలుగు నిర్మాతల మండలి ప్రాంగణంలో జరిగిన దాసరి వర్ధంతి కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దాసరి విగ్రహానికి పుష్పమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం అందరికీ “దాసరి స్మారక పురస్కారాలు” అందజేశారు.
ఆ రోజుల్లో వరుసగా పన్నెండు హిట్లు ఇచ్చిన మొట్టమొదటి గొప్ప దార్శనికుడు దాసరి. దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదంగా నిలిచిన ఆ మహనీయుడు గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందరో దర్శకులు వస్తారు పోతారు, దాసరి లాంటి దర్శకుడు మాత్రం మళ్ళీ పుట్టడు.
ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలన్నా.. ఆయన తరువాతే ఎవరైనా.
Also Read: Nara Lokesh Padayatra: పాదయాత్రకు చిన్నబాబు సన్నాహాలు.. చంద్రబాబు భారీ యాక్షన్ ప్లాన్
చిన్న నిర్మాతలకు ఆయన పెద్ద దిక్కు. చిత్రసీమలో న్యాయానికి ఆయన మేస్త్రి. అందుకే, తెలుగు సినిమాకి ఉనికి ఉన్నంత వరకూ దాసరి ప్రస్థానం గురించి పురాణ ఇతిహాసాల మాదిరిగా ఆయన గురించి అనేక కథనాలను భవిష్యత్తు తరాలు చెప్పుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే ఏభై మంది అనామకులకు నటీనటులుగా జన్మనిచ్చిన దేవుడు దాసరి.
ఎనభై మంది సినీ సాంకేతిక వర్గానికి చెందిన అవకాశం ఇచ్చి వారికీ సినీ బతుకును అందించిన దానవుడు దాసరి. ఇలా కొన్ని వేలమంది జీవితాలలో దాసరి వెలుగులను నింపారు. తన సినిమాలతో కొన్ని లక్షల మంది హృదయాలలో సంతోషాలను వెదజల్లారు. అందుకే దాసరి పుట్టిన రోజే డైరెక్టర్స్ డే అయింది. గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వంగా సగర్వంగా దాసరి జయంతిని దర్శకుల దినోత్సవం ప్రకటించింది.
అయితే, నేడు దాసరి వర్ధంతిని మాత్రం తెలుగు సినీ ప్రముఖులు మర్చిపోయారు. ఏ స్టార్ హీరో ఆయనను తల్చుకోలేదు. నేడు టీవీల్లో ఆయన విజువల్స్ మీద ఆయన గురించి రెండు ముక్కలు మంచి మాటలు చెప్పేసి రేపటికి మర్చిపోవచ్చు. కానీ దాసరి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ఆ సినిమాలు ఉన్నంత వరకూ మన హృదయాల్లో ఆయన శాశ్వతంగా సజీవంగా నిలిచే ఉంటారు.
Also Read: Jayasudha: ప్చ్.. జయసుధ కోరిక నెరవేరుతుందా ?