https://oktelugu.com/

Katrina Kaif Wedding: కత్రీనా పెళ్లి అరేంజ్‌మెంట్స్ అదుర్స్.. మెనూలో ఎన్ని వెరైటీలో…

Katrina Kaif Wedding:  బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ పెళ్లికూతురుగా మారింది. విక్కీ కౌశల్‌ను మ్యారేజ్ చేసుకోనుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఈనెల 7న స్టార్ట్ అయ్యాయి. వీరి మ్యారేజ్ విషయం బాలీవుడ్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యారేజ్ ఫంక్షన్‌కు పెద్ద సెలబ్రెటీస్ సైతం హాజరుకానున్నారు. మ్యారేజ్‌కు హాజరయ్యే వారి విషయంలో ఈ జంట ఇప్పటికే కొన్ని కండీషన్స్ పెట్టినట్టు టాక్. కాగా మ్యారేజ్‌లో మెనూ ఎలా ఉంటుందోనని చాలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2021 / 03:45 PM IST
    Follow us on

    Katrina Kaif Wedding:  బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ పెళ్లికూతురుగా మారింది. విక్కీ కౌశల్‌ను మ్యారేజ్ చేసుకోనుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఈనెల 7న స్టార్ట్ అయ్యాయి. వీరి మ్యారేజ్ విషయం బాలీవుడ్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యారేజ్ ఫంక్షన్‌కు పెద్ద సెలబ్రెటీస్ సైతం హాజరుకానున్నారు. మ్యారేజ్‌కు హాజరయ్యే వారి విషయంలో ఈ జంట ఇప్పటికే కొన్ని కండీషన్స్ పెట్టినట్టు టాక్. కాగా మ్యారేజ్‌లో మెనూ ఎలా ఉంటుందోనని చాలా మందిలో ఇంట్రెస్ట్ పెరిగింది. మన దేశంలో పెళ్లి అంటే చాలా మంది ఫుడ్ కు మంచి ప్రియారిటీ ఇస్తారు. వీరి పెళ్లిలో మన దేశపు వంటకాలతో పాటు ఇతర దేశాల వంటకాలను సైతం ఏర్పాటు చేస్తున్నారట. అయితే పెళ్లికి వస్తున్న అతిథులను దృష్టిలో ఉంచుకుని కత్రీనా, విక్కీ ఇద్దరూ కలిసి మెనూ సెలక్ట్ చేశారని వారి సన్నిహిత వర్గాల సమాచారం.

    Katrina Kaif

    వీరి పెళ్లి విందులో కచోరీలు, దహీ భల్లా, ఫ్యూజన్‌చాట్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. కబాబ్‌లు, ఫిష్ ప్లాటర్‌, దాల్ బాటి చుర్మా, పప్పులతో చేసిన సుమారు 15 రకాల వెరైటీలను వడ్డించనున్నారని టాక్. ఇటలీ దేశానికి చెందిన ఒక చెఫ్‌తో 5 లైర్ టిఫనీ కేక్ సైతం తయారు చేయిస్తున్నారు. పాన్, గోల్గప్పా, ఇతర ఇండియన్ రుచులను అతిథులకు చూపించనున్నారు. వీటితో పాటు ఉత్తర భారతదేశానికి సంబంధించిన పలు వంటకాలను సైతం చేయిస్తున్నారట. పెళ్లి తర్వాత వీరు నివసించేందుకు ఓ అపార్ట్‌మెంట్ తీసున్నారని టాక్. దీని రెంట్ నెలకు సుమారు రూ.8 లక్షలని తెలుస్తోంది. 5 ఏండ్లకు గానూ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడట విక్కీ. అతడు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ సైతం దాదాపు రూ.1.75 కోట్లని టాక్. ఇందుకు నెల నెల అద్దె విషయంలో మార్పులు జరుగుతాయట.

    Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ నుంచి “అలియా భట్” మేకింగ్ వీడియో ఔట్…

    వీరి డెస్టినేషన్ వెడ్డింగ్.. సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ బార్వారా.. సవాయి మాధోపూర్‌లో జరుపనున్నారు. సుమారు 14వ శతాబ్దములో దీనిని నిర్మించారు. వెడ్డింగ్‌కు సరిపోయేలా ఉంటుంది ఈ రిస్టార్ట్. అయితే పెళ్లికి వచ్చే గెస్టుల కోసం ఈ జంట చాలా కండీషన్స్ పెట్టిందని టాక్. నో మొబైల్ డిక్టాట్‌ను సైతం విధించారట. ఇంత హడావుడి చూస్తుంటే వీరు వెడ్డింగ్‌కు ఏ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇందుకు చాలా మంది సెలబ్రిటీలు సైతం రానున్నారు. మరి వారికి మర్యాదలు చేసేందుకు సైతం స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేశారని తెలుస్తోంది.

    Also Read: Indian 2 Movie: కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా…

    Tags