Alia Bhatt: నేటి బాలీవుడ్ హీరోయిన్స్ లో ‘ఆలియా భట్’ శైలి వేరు. నిజానికి అలియా భట్ లా ప్రస్తుతం ఏ హీరోయిన్ లేదు. ఎందుకంటే… అలియా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. పైగా ఆమె అద్భుతమైన నటి. అన్నిటికి కంటే ముఖ్యంగా అలియాకి హిందీలో స్టార్ డమ్ కూడా ఎక్కువే. అయినా కూడా, రాజమౌళి తన సినిమాలో ఓ చిన్న పాత్రను ఆఫర్ చేశాడు. సహజంగా ‘అలియా’ లాంటి స్టార్ హీరోయిన్ ఆ చిన్న పాత్రను చేయడానికి ఆసక్తి చూపించదు.

కానీ అలియా చూపించింది. “ఆర్ఆర్ఆర్”లో చిన్న పాత్ర పోషించేందుకు ఆమె అంగీకరించింది. చాలామందికి ఈ విషయం తెలియదు. సినిమాలో ఆమె పేరుకు హీరోయిన్ అంతే. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది చాలా తక్కువ సమయం మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే ఆమెది ఒక అతిథి పాత్ర అన్నమాట.
అసలు ఇలాంటి రోల్ చేసిన తర్వాత, ఇక ఆ సినిమా కోసం ఏ స్టార్ హీరోయిన్, పైగా నేషనల్ స్థాయి హీరోయిన్ ఆ సినిమా ప్రమోషన్స్ కి అసలు టైం కేటాయించదు. చిన్న బైట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది. కానీ అలియా వేరు కదా. పూర్తిగా కమిట్ మెంట్ ఉన్న హీరోయిన్ కదా. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాలో తనది చిన్న పాత్ర అని తెలిసి కూడా ఆ సినిమా కోసం పబ్లిసిటీ చేస్తోంది.
Also Read: అందుకే తెలుగు తెర పై హీరోయిన్ స్థాయి పడిపోయింది.
అంతేకాదు, రెండు రోజుల గ్యాప్ లో ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని నగరాల్లో సినిమా ప్రెస్ మీట్ లకు అటెండ్ అయి, సినిమా గురించి, హీరోల గురించి, రాజమౌళి గురించి నాలుగు మంచి మాటలు చెప్పింది. అలియా మొదటి నుంచి ఇంతే. ఒక సినిమా ఒప్పుకుంటే… దానికి న్యాయం చెయ్యడమే ఆమె ముందు ఉన్న కర్తవ్యం.
ఒక విధంగా ఇది అలియా ప్రొఫెషనలిజం. అలియా తలుచుకుంటే.. నాకు హిందీ సినిమాల కమిట్ మెంట్స్ చాలా ఉన్నాయి, సో.. నేను సినిమా ప్రమోషన్ కి రాలేను, సారీ’ అంటే.. ఆమెను ఎవరు ఏమీ అనలేరు. కానీ, అలియా ఒక్క బాలీవుడ్ వరకే ప్రమోషన్ కి పరిమితం అవ్వలేదు. మిగిలిన రాష్ట్రాలకు వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తోంది. అందుకే.. అలియా ఆ విషయంలో చాలా గ్రేట్. అలియా ముందు ఏ హీరోయిన్ నిలబడలేదు.
Also Read: రజనీకాంత్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?