https://oktelugu.com/

Rajanikanth Bday Special: దెబ్బ అదుర్స్​ కదూ!… రజనీ సూపర్​ హిట్​ డైలాగ్స్ ఇవే

Rajanikanth Bday Special: తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​ పుట్టిన రోజు నేడు. టికెట్ కండక్టర్​గా జీవితాన్ని మొదలుపెట్టి.. సూపర్​స్టార్​గా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం అద్భుతం. ఒక్క దక్షిణాదిలోనే కాకుండా యావత్​ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతంచేసుకున్న నటుడు రజనీ. ఆయన సినిమాలు ఎలాంటి కోణంలోనైనా ఉండనీ.. అందులో ఏదో ఒక జీవిత సత్యాన్ని  చెప్తూ.. ప్రేక్షకులకు జ్ఞానబోద చేస్తుంటారు. బాధ, సంతోషం, బంధాలు ఇలా మనిషిని బాధించే విషయాలన్నింటిపై తన సినిమాల ద్వారా రిఫ్లెక్ట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 12, 2021 / 11:56 AM IST
    Follow us on

    Rajanikanth Bday Special: తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​ పుట్టిన రోజు నేడు. టికెట్ కండక్టర్​గా జీవితాన్ని మొదలుపెట్టి.. సూపర్​స్టార్​గా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం అద్భుతం. ఒక్క దక్షిణాదిలోనే కాకుండా యావత్​ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతంచేసుకున్న నటుడు రజనీ. ఆయన సినిమాలు ఎలాంటి కోణంలోనైనా ఉండనీ.. అందులో ఏదో ఒక జీవిత సత్యాన్ని  చెప్తూ.. ప్రేక్షకులకు జ్ఞానబోద చేస్తుంటారు. బాధ, సంతోషం, బంధాలు ఇలా మనిషిని బాధించే విషయాలన్నింటిపై తన సినిమాల ద్వారా రిఫ్లెక్ట్ చేసేలా చేస్తుంటారు. అలా కొన్ని డైలాగ్​లు పవర్​ఫుల్​గా కనిపిస్తే.. మరికొన్ని ఆలోచించేలా చేస్తాయి. అలా జనాల్లో ఇప్పటికీ గుర్తుండిపోయిన ఆయన సినిమాల్లోంచి కొన్ని డైలాగ్​లు మీ కోసం.

    పక్షి గుణమే ఎగరడం రా.. వదిలేయ్​ చావో బతుకో అదే తేల్చుకుంటుంది.. నువ్వు పెట్టే ఈ భిక్ష దానికి మరణం కంటే భయంకరం- కబాలి.

    అతిగా ఆవేశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు.- నరసిమా సినిమా.

    న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే.. తప్పు చేసినవాడు శత్రువు, ఒప్పు చేసిన వాడు బంధువు- పెదరాయుడు
    ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమిస్తే.. మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లే- పెదరాయుడు

    నాన్నా పందులే గుంపులు గుంపులుగా వస్తాయ్​.. సింహం సింగిల్​గా వస్తుంది- శివాజి.

    తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత- బాబా

    జన్మ విరోధినైనా క్షమిస్తానేమో కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం అసలు క్షమించను.
    నా దారి రహదారి.. బెటర్ డోంట్​ కమ్ ఇన్​మైవే- నరసింహా

    ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా వస్తుంది.? ఏదో నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలింది దానం చేస్తేనే మనశ్శాంతి-ముత్తు

    దేవుడు శాసించారు ఈ అరుణాచలం పాటిస్తాడు- అరుణాచలం.

    మంచివాడు మొదట కష్టపడచ్చు.. కానీ ఓడిపోడు.. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ కచ్చితంగా ఓడిపోతాడు.-భాష

    నేను ఒకసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్లే- భాషా