Ben Stokes : పాక్ టూర్ లో స్టార్ క్రికెటర్.. ఇంట్లో దొంగలు పడి అందినంత కాడికి దోచుకుపోయారు!

అతడో స్టార్ క్రికెటర్. అద్భుతంగా ఆడతాడు. జట్టును ముందుండి నడిపిస్తాడు. తన టీమ్ కు గొప్ప విజయాలు అందించాడు. ఈ క్రమంలో విలువైన బహుమతులు పొందాడు. అరుదైన పురస్కారాలు సాధించాడు. ఇప్పుడు అవన్నీ దొంగల చేతిలో ఉన్నాయి. అదేంటి ఒక క్రికెటర్ సాధించిన పురస్కారాలు దొంగల దగ్గర ఉండటం ఏంటి? అనే ప్రశ్న మీలో తలెత్తింది కదూ.. అయితే చదవండి ఈ స్టోరీ..

Written By: Anabothula Bhaskar, Updated On : October 31, 2024 7:46 pm

Ben Stokes

Follow us on

Ben Stokes : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ ప్రస్తుతం బజ్ బాల్ క్రికెట్ ఆడుతోంది అంటే దానికి ప్రధాన కారణం బెన్ స్టోక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అటువంటి ఆటగాడి ఇంట్లో దొంగలు పడ్డారు. నానా బీభత్సం సృష్టించారు. బెన్ స్టోక్స్ భార్యా పిల్లలు ఇంట్లో ఉండగానే దొంగలు చివరికి పాల్పడ్డారు. ప్రస్తుతం స్టోక్స్ పాకిస్తాన్ టూర్ లో ఉన్నాడు. టెస్ట్ సిరీస్ లో ఆడుతున్నాడు. అతడి ఇంట్లో విలువైన ఆభరణాలు ఉన్నాయి. అత్యంత విలువైన నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ క్రికెట్ కు చేసిన సేవలకు గాను అతడికి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం లభించింది. దానిని కూడా దొంగలు తిరస్కరించారు. ఈ విషయాన్ని స్టోక్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ” నార్త్ ఈస్ట్ కాస్లే ఈడెన్ లో మా ఇల్లు ఉంటుంది. అక్టోబర్ 17న మాస్క్ లు ధరించిన కొంతమంది వ్యక్తులు మా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నా భార్య కార్లే, పిల్లలు లేటన్, లిబ్బి ఇంట్లోనే వేరే గదిలో ఉన్నారు. దొంగలు అత్యంత చాకచక్యంగా నగలను, ఖరీదైన ఆభరణాలను తస్కరించారు. నాకు బ్రిటిష్ ప్రభుత్వం అందించిన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ మెడల్ ను కూడా దోచుకెళ్లిపోయారు. అయితే ఆ దొంగలు నా భార్యా పిల్లలకు హాని తలపెట్టలేదు. ఆ దొంగలు ఎత్తుకుపోయిన వస్తువులు నాకు అత్యంత విలువైనవి. అవి ఎంతో అమూల్యమైనవి. ఇటువంటి నేరానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలని” ట్విట్టర్ ఎక్స్ లో కోరాడు.

పాక్ టూర్ లో విఫలం

స్టోక్స్ ఆటతీరుతో మాత్రమే కాదు, ప్రవర్తన తోనూ అత్యంత వివాదాస్పద క్రికెటర్ గా పేరుపొందాడు. రెండు నెలల క్రితం అతడు జట్టులకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. ఇటీవలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టుకు స్టోక్స్ నాయకత్వం వహించాడు. అతని ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. పాకిస్తాన్ స్పిన్నర్లు చుక్కలు చూపించడంతో.. ఇంగ్లాండ్ జట్టు 1-2 తేడాతో సిరీస్ పోగొట్టుకుంది. ఇక ఇటీవల శ్రీలంక జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో విజయం సాధించిన ఇంగ్లాండు జట్టు.. అదే ఊపును కొనసాగించలేకపోయింది. స్టోక్స్ తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ప్రస్తావించడంతో.. చాలామంది అతనికి అండగా ఉంటున్నారు. ఇంగ్లాండ్ పోలీసులు ఆ దొంగలను పట్టుకుంటారని.. సీసీ కెమెరాలు ఉన్నంతవరకు దొంగలు ఎక్కడికీ పారిపోలేరని.. ఒకవేళ పారిపోయినప్పటికీ పోలీసులు పట్టుకుంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.