https://oktelugu.com/

Rakesh Master: నా ప్రాణం పోయే క్షణాన్ని కూడా కెమెరాలో బంధించాలి… కోరుకున్నట్లే చనిపోయిన రాకేష్ మాస్టర్!

అక్కడ నేను మా మామగారి సమాధి పక్కన నన్ను పూడ్చి పెట్టాలని మిత్రులను కోరాను. ఇప్పుడు ఒక వేప చెట్టు నాటాను. అక్కడే గొయ్యి తవ్వుతున్నారు. చెట్టు క్రింద ఎందుకు సమాధి చేయంమంటున్నానంటే, నాకు చల్లదనం ఇష్టం. సముద్రాలు, చెరువులు, చెట్లు, హిమాలయాలను ఇష్టపడతాను. నా శరీరం ఏ భూమిలో కలిసిపోవాలి. అందుకే దహనం చేయడానికి ఇష్టపడను. ఒకవేళ దహనం చేసినా... కనీసం నా అస్థికలైనా నెలలో పాతి పెట్టాలి, అని అన్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2023 / 03:25 PM IST

    Rakesh Master

    Follow us on

    Rakesh Master: రాకేష్ మాస్టర్ కి ఒక దశకు వచ్చాక జీవితం మీద ఆశ పోయింది. నేను చావును వెతుక్కుంటూ వెళుతున్నాను. అది ఎప్పుడు వచ్చినా పర్లేదు. నా తమ్ముడు, అమ్మానాన్నల చావులు చూశాను. బ్రతుకు మీద ఆశపోయింది. అందుకే నా చావు నేను ముందుగానే చూడాలని అనుకుంటున్నాను అన్నాడు. గతంలో తాను చనిపోయితే ఏం చేయాలో స్పష్టంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ రోజు స్వయంగా తన సమాధి తవ్వించుకున్నాడు. రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ… నేను బోరబండ శివగంగా నగర్ లో ఉంటాను. మా బిల్డింగ్ కి వెనుకవైపు ఈ స్మశానం ఉంటుంది.

    అక్కడ నేను మా మామగారి సమాధి పక్కన నన్ను పూడ్చి పెట్టాలని మిత్రులను కోరాను. ఇప్పుడు ఒక వేప చెట్టు నాటాను. అక్కడే గొయ్యి తవ్వుతున్నారు. చెట్టు క్రింద ఎందుకు సమాధి చేయంమంటున్నానంటే, నాకు చల్లదనం ఇష్టం. సముద్రాలు, చెరువులు, చెట్లు, హిమాలయాలను ఇష్టపడతాను. నా శరీరం ఏ భూమిలో కలిసిపోవాలి. అందుకే దహనం చేయడానికి ఇష్టపడను. ఒకవేళ దహనం చేసినా… కనీసం నా అస్థికలైనా నెలలో పాతి పెట్టాలి, అని అన్నాడు.

    అలాగే తాను ప్రాణం విడిచే క్షణాలను రికార్డు చేయాలి. ఆ వీడియో అందరూ చూడాలి అన్నాడు. అనూహ్యంగా తాను కోరుకున్నట్లే రాకేష్ మాస్టర్ చివరి క్షణాలు వీడియోలో కొందరు రికార్డు చేశాడు. గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న దయనీయమైన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

    అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం రాకేష్ మాస్టర్ భౌతిక కాయం తన నివాసంలో ఉంచారు. రాకేష్ మాస్టర్ శిష్యుడు శేఖర్ మాస్టర్ భౌతికకాయాన్ని సందర్శించారు. నివాళులు అర్పించారు. ఆయన కన్నీరు పెట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ కెరీర్ మొదలైంది రాకేష్ మాస్టర్ వద్ద. ఆయన శిష్యుడిగా ఏళ్ల తరబడి ప్రయాణం చేశాడు. ఇప్పుడు స్టార్ కొరియాగ్రాఫర్ రేంజ్ కి వెళ్లాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆ మధ్య ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.