Evaru Meelo Koteeswarulu : ఎన్టీఆర్ ఎలా అడిగాడు, చరణ్ ఎలా చెప్పాడు ?

Evaru Meelo Koteeswarulu 2021: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Koteeswarulu) రెండో ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తొలి ఎపిసోడ్‌ లాగే రెండో ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతూ అదే జోరుని కొనసాగించింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన ఈ ఎపిసోడ్‌ లో హైలైట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – చరణ్ మధ్య సాగిన ఆసక్తికర ముచ్చట్లు, అలాగే లైఫ్‌ లైన్‌ ద్వారా రామ్‌ చరణ్‌, రానాని సంప్రదించడం, రానా […]

Written By: admin, Updated On : August 24, 2021 11:33 am
Follow us on

Evaru Meelo Koteeswarulu 2021: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Koteeswarulu) రెండో ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తొలి ఎపిసోడ్‌ లాగే రెండో ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతూ అదే జోరుని కొనసాగించింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన ఈ ఎపిసోడ్‌ లో హైలైట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – చరణ్ మధ్య సాగిన ఆసక్తికర ముచ్చట్లు, అలాగే లైఫ్‌ లైన్‌ ద్వారా రామ్‌ చరణ్‌, రానాని సంప్రదించడం,

రానా లైన్ లోకి రాగానే బావా అంటూ ఎన్టీఆర్ పిలవడం, ఇక ఎన్టీఆర్ – చరణ్‌ – రానా మధ్య సాగిన సంభాషణలు కూడా బాగా అలరించాయి. మొత్తానికి రామ్ చరణ్(Ram Charan) ఆట తీరు, ఎన్టీఆర్ (NTR) ఆటను ఆడించిన విధానం చాలా బాగుంది. అయితే, ఈ ఎపిసోడ్ తో చరణ్ మొత్తం ఎంతవరకు గెలుచుకున్నారు ? రామ్ చరణ్‌ ను ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు.. ఆలాగే వాటి సమాధానాలు ఏమిటో చూద్దాం.

9. జూన్‌ 2020లో ఇండియా- చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్‌ లోయ ఏ ప్రాంతంలో ఉంది ? అంటూ ఎన్టీఆర్ చరణ్ వైపు చూశాడు.

ఎ) లద్దాఖ్‌ బి) హిమాచల్‌ ప్రదేశ్‌ సి) రాజస్థాన్‌ డి) అరుణాచల్‌ ప్రదేశ్‌

పై నాలుగు ఆప్షన్స్ చూసి ఆలోచనలో పడిన చరణ్.. కొంత సేపు తర్వాత ‘లద్దాఖ్‌’ అంటూ సరైన సమాధానం చెప్పాడు.

10. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్‌ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన మొట్ట మొదటి భారతీయ చిత్రం ఏది? అంటూ ఈ ప్రశ్న అడుగుతూనే ఎన్టీఆర్ చిన్న చిరునవ్వు నవ్వాడు.

ఎ) బాహుబలి: ది బిగినింగ్‌ బి) దంగల్‌ సి) 2.0 డి) కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1

చరణ్ కూడా పై ఆప్షన్స్ గురించి ఎక్కువ ఆలోచించకుండా బాహుబలి అని సరైన సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా రాజమౌళిను చరణ్ పొదిగిన విధానం బాగుంది.

11. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్‌.ఎస్‌. ఘాజీ అసలు పేరేంటి? అంటూ ఎన్టీఆర్, చరణ్ ను టెన్షన్ పెడుతూ అడిగాడు.

ఎ) చెరోకీ బి) హెర్క్యులీస్‌ సి) ఫోర్డ్‌ డి) డియాబ్లో

ఈ ప్రశ్నకు డియాబ్లో అని సరైన సమాధానం చెప్పడానికి చరణ్ ‘వీడియో కాల్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌’ ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని రానాని ఎంపిక చేసుకున్నాడు. రానా సరైన సమాధానం చెప్పి చరణ్‌ ని గెలిపించారు.

12. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్‌ వెట్టెల్‌ 2021 సీజన్‌లో ఏ ఫార్ములా 1 టీమ్‌కి డ్రైవ్‌ చేస్తున్నారు? అంటూ ఎన్టీఆర్ ఈ ప్రశ్న విషయంలో తేలికపాటి సస్పెన్స్ పెట్టాడు.

ఎ) రెడ్‌బుల్‌ బి) విలియమ్స్ సి) ఆస్టన్‌ మార్టిన్‌ డి) మెక్‌లారెన్‌

ఆస్టన్‌ మార్టిన్‌ అంటూ చరణ్ తేలికగానే సమాధానం చెప్పాడు.

13. ఏ పాలకుడి దగ్గర బ్యూసిఫాలస్‌ అనే యుద్ధాశ్వం ఉండేది? అంటూ ఎన్టీఆరే ఆలోచనలో పడుతూ ఈ ప్రశ్న అడిగాడు.

ఎ) అశోక ది గ్రేట్‌ బి) అక్బర్‌ ది గ్రేట్‌ సి)అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ డి) ఆల్ఫ్రెడ్‌ ది గ్రేట్‌

సమాధానం: సి)అలెగ్జాండర్‌ ది గ్రేట్‌

ఈ ప్రశ్నకు సమాధానం తెలియక చరణ్‌ ‘50-50’ లైఫ్‌ని వినియోగించుకున్నారు. అందులో సరైన సమాధానం చెప్పి రూ.25,000,00 గెలుచుకున్నారు. ఈ 25 లక్షలను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నతో ఎపిసోడ్ ముగిసింది.