Telangana Postal Circle Recruitment 2021: తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://tsposts.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తం 55 ఉద్యోగ ఖాళీలలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 11, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 8, పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ ఉద్యోగ ఖాళీలు 26, ఎంటీఎస్ ఉద్యోగ ఖాళీలు 10 ఉంటాయి. సంబంధిత స్థానిక భాష వచ్చి పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ ఉద్యోగ ఖాళీల కోసం 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఎంటీఎస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో సంబంధిత క్రీడలో ప్రాతినిధ్యం వహించిన వాళ్లు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా 2021 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.