https://oktelugu.com/

ఆవిరైన ఉత్సాహం.. థియేటర్లు ఓపెన్ చేస్తే నష్టపోవాల్సిందేనా?

దేశంలోకి కరోనా ఎంట్రీతో సినిమారంగం కుదేలైపోయింది. ఓవైపు థియేటర్లు.. మరో వైపు షూటింగులు నిలిచిపోవడంతో ఈరంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే థియేటర్లకు మాత్రం కేంద్రం చాలా ఆలస్యంగా అనుమతి ఇచ్చింది. Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..! దాదాపు ఏడునెలల తర్వాత అంటే నేటి నుంచి థియేటర్లు ఓపెనింగ్ చేసుకునేలా కేంద్రం ఆదేశాలిచ్చింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 12:29 PM IST
    Follow us on

    దేశంలోకి కరోనా ఎంట్రీతో సినిమారంగం కుదేలైపోయింది. ఓవైపు థియేటర్లు.. మరో వైపు షూటింగులు నిలిచిపోవడంతో ఈరంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే థియేటర్లకు మాత్రం కేంద్రం చాలా ఆలస్యంగా అనుమతి ఇచ్చింది.

    Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!

    దాదాపు ఏడునెలల తర్వాత అంటే నేటి నుంచి థియేటర్లు ఓపెనింగ్ చేసుకునేలా కేంద్రం ఆదేశాలిచ్చింది. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెనింగ్ చేసుకోవాలని.. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ కేంద్రం మెలిక పెట్టింది. దీంతో థియేటర్లు యజమానులు సినిమా హాళ్లను తెరిచేందుకు వెనుకాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ చేస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు.

    కరోనా నేపథ్యంలో ప్రజలంతా వ్యక్తిగత రక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసినా ప్రజలు థియేటర్లకు వస్తారా? వస్తే ఎంతమంది వస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే స‌మ‌యంలో 50శాతం థియేట‌ర్ల‌ను నింపినా త‌మ‌కు ఎలాంటి ఉప‌యోగం ఉండదని ఎగ్జిబీట‌ర్లు చెబుతున్నారు. ఇలా చేస్తే థియేటర్ల నిర్వహాణకు కూడా సరిపోనూ డబ్బులు రావని థియేటర్ యజమానులు వాపోతున్నారు.

    Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!

    ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబీట‌ర్లు థియేట‌ర్లు తెర‌వ‌డానికి సంసిద్ధంగా లేన‌ట్టుగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత నియ‌మాల‌తో థియేట‌ర్ల‌ను తెరిస్తే త‌మ‌కు భారీ న‌ష్టాలు వస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిలో ఇలా ఉంటే కర్ణాటకలో టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. అయితే ప‌రిమిత సంఖ్య‌లోనే థియేట‌ర్ల‌ను ఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా థియేటర్ల ఓపెనింగ్ విషయంలో మాత్రం యజమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.