భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం వరద ప్రాంతాలను పరిశీలించారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సిబీఐ క్వాటర్స్, బీజేఆర్, గణేశ్‌నగర్‌లో పర్యటించి జరిగిన నష్టాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలాలపై పడ్డ చెట్లు, చెత్తలను తొలగించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలని అధికారులకు సూచంచారు. దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ద్వారా నష్టపరిహారం […]
భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం వరద ప్రాంతాలను పరిశీలించారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సిబీఐ క్వాటర్స్, బీజేఆర్, గణేశ్‌నగర్‌లో పర్యటించి జరిగిన నష్టాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలాలపై పడ్డ చెట్లు, చెత్తలను తొలగించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలని అధికారులకు సూచంచారు. దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్త్తానని హామీ ఇచ్చారు.