https://oktelugu.com/

Ram Charan : మొదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..ట్రెండ్ ఎలా ఉందంటే!

: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'పుష్ప 2' మేనియా ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఈ మేనియా కొనసాగుతుండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మేనియా కూడా మొదలైపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 10:54 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘పుష్ప 2’ మేనియా ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఈ మేనియా కొనసాగుతుండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మేనియా కూడా మొదలైపోయింది. మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరూ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉన్నారు. జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ‘గేమ్ చేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న లండన్ లో మొదలైంది. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం మొదలైంది. 24 గంటలు కూడా గడవకముందే ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేసింది ఈ చిత్రం. అక్కడి ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం దేవర చిత్రం నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సినిమాకి మొదటి రోజు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ రికార్డు ని ‘పుష్ప 2’ కూడా బ్రేక్ చేయలేకపోయింది.

    అయితే ‘గేమ్ చేంజర్’ దెబ్బకి ‘దేవర’ రికార్డు ఇప్పుడు డేంజర్ లో పడేలా ఉందని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లండన్ లో మొదలైన మొదటి గంటలో 500 టిక్కెట్లకు పైగా అమ్ముడుపోయాయని, ఆ తర్వాత వెయ్యికి పైగా అమ్ముడుపోయాయని, 12 గంటలు పూర్తి అయ్యేలోపు ఈ చిత్రానికి 3 వేల 500 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని, ట్రెండ్ చూస్తుంటే 24 గంటల్లో ఆరు వేల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే ట్రెండ్ వీకెండ్ వరకు కొనసాగితే పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతాయని, అదే కనుక జరిగితే ‘దేవర’ మొదటి రోజు 20 వేల టికెట్స్ రికార్డు బద్దలు అవుతుందని చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు. లండన్ లోనే ఈ రేంజ్ ట్రెండ్ ఉందంటే, ఇక నార్త్ అమెరికా లో ఏ రేంజ్ ట్రెండ్ ఉంటుందో అని ఇప్పటి నుండే అంచనా వేస్తున్నారు.

    మరో రెండు మూడు రోజుల్లో నార్త్ అమెరికా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం కల్కి చిత్రానికి ఇక్కడ ప్రీమియర్ షోస్ ద్వారా ఆల్ టైం రికార్డు వచ్చింది. ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోస్ నుండి నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాతి స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిల్చింది. ఈ సినిమాకి ఇక్కడ 3.3 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం ఈ రెండు సినిమాలను అధిగమించి ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. మరి ఆ రేంజ్ ట్రెండ్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రెండవ వారం లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.