https://oktelugu.com/

Mohan Lal : మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..కారణం ఏమిటంటే!

Mohan Lal : మోహన్ లాల్ ఈ చిత్రం విడుదల సందర్భంగా శబరిమలై ని మంగవలవారం నాడు సందర్శించాడు. తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు తన ఆప్త మిత్రుడు మమ్ముటి పేరు మీద కూడా ప్రత్యేక పూజలు చేయించాడు.

Written By: , Updated On : March 19, 2025 / 08:54 PM IST
Mohanlal-Mammootty

Mohanlal-Mammootty

Follow us on

Mohan Lal : మలయాళం ఫిలిం ఇండస్ట్రీ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు మమ్ముటి(Mammootty), మోహన్ లాల్(Mohanlal). దశాబ్దాల నుండి మాలీవుడ్ ని ఈ ఇద్దరు హీరోలే ఏలుతున్నారు. ఎంతోమంది కుర్ర హీరోలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటారు కానీ, వీళ్లిద్దరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇప్పటికీ ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబడుతూ మలయాళం ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా నిలిచారు. ఇదంతా పక్కన పెడితే మోహన్ లాల్ రీసెంట్ గా లూసిఫర్ సీక్వెల్ ‘L2 : Empuran’ చిత్రం చేసాడు. ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది. ప్రముఖ యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ ని కూడా ఇప్పటికే మొదలు పెట్టేసారు.

Also Read : ‘యానిమల్’ అవతారం లో MS ధోని..ఇక సినిమాల్లోకి వచ్చేయొచ్చు

ఇదంతా పక్కన పెడితే మోహన్ లాల్ ఈ చిత్రం విడుదల సందర్భంగా శబరిమలై ని మంగవలవారం నాడు సందర్శించాడు. తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు తన ఆప్త మిత్రుడు మమ్ముటి పేరు మీద కూడా ప్రత్యేక పూజలు చేయించాడు. మమ్ముటి అసలు పేరైన మహమ్మద్ కుట్టి తో మోహన్ లాల్ పూజలు చేయించాడని అక్కడి స్థానిక పత్రికల్లో వార్తలు ప్రచురింపబడ్డాయి. ఒకే ఇండస్ట్రీ కి చెందిన ఇద్దరు సరిసమానమైన సూపర్ స్టార్స్, ఇంత ప్రేమ ఆప్యాయతలతో మెలగడం చాలా అరుదు కదా. ఇలా అన్ని ఇండస్ట్రీ లో ఉన్న సూపర్ స్టార్స్ కలిసి ఉంటే ఎంతో బాగుంటుందని అంటున్నారు సినీ అభిమానులు. ఇదంతా పక్కన పెడితే మమ్ముటి కి ఆరోగ్యం సరిగా లేదని ఇటీవల కాలం లో ఒక రూమర్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. దీంతో ఆయన అభిమానులు తీవ్రమైన ఆందోనళనకు గురయ్యారు.

ఈ వార్తలు మమ్ముటి టీం వరకు వ్యాప్తి చెందడంతో వెంటనే స్పందించిన టీం ‘మమ్ముటి గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. రంజాన్ మాసం సందర్భంగా ఆయన షూటింగ్స్ బ్రేక్ తీసుకొని వెకేషన్స్ కి వెళ్లారు. తిరిగి రాగానే ఆయన మోహన్ లాల్ తో కలిసి చేయబోతున్న మహేష్ నారాయణ్ మూవీ షూటింగ్ లో ప్లాగొనబోతున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వీళ్లిద్దరు కలిసి గతం లో ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేసారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇకపోతే మోహన్ లాల్ నటించిన ‘L2:Empuran’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి. నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కి సరికొత్త ఇండస్ట్రీ హిట్ అయ్యేలాగ అనిపిస్తుంది.