Star heroine : బాలీవుడ్ మేకర్స్ కి మన టాలీవుడ్ నటీనటులంటే మొదటి నుండి చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడు మన టాలీవుడ్ బాలీవుడ్ ని పూర్తి స్థాయిలో డామినేట్ చేయడం వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు అయితే చిరంజీవి స్థాయి నటులకు కాస్త గౌరవం దక్కేది ఏమో కానీ, సాధారణ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ బాలీవుడ్ కి వెళ్ళినప్పుడు షూటింగ్ సమయంలో వాళ్లకు ఎన్నో అవమానాలు జరిగాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు మిగిలాయి. శోభన(Sobhana) అనే సీనియర్ హీరోయిన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా ఈమె కల్కి(Kalki 2898 AD”) చిత్రం లో చేశారు, అదే విధంగా మలయాళం హీరో మోహన్ లాల్(Mohanlal) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘L2 :ఎంపురాన్'(L2: Empuraan) లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఇలా ఈ వయస్సులో కూడా భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.
అయితే ఈమెకు బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారి సినిమా లో ఒక ప్రత్యేకమైన సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటూ ఉన్నాను. ఆ సమయం లో నేను బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. సెట్స్ లో ఎటు చూసిన రద్దీ గా ఉన్నది. అంత మగవాళ్లే ఉన్నారు. నాకు కాస్త కారవాన్ ఏర్పాటు చేస్తే బట్టలు మార్చుకొని వస్తాను అని మేకర్స్ ని రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. ఆ చెట్టు వెనుక బట్టలు మార్చుకోమని చెప్పారు. ఈ విషయం అమితాబ్ బచ్చన్ గారి వరకు వెళ్ళింది. అప్పుడు ఆయన నన్ను వెంటనే పిలిచి తన కారవాన్ ఇచ్చి బట్టలు మార్చుకోమని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చింది శోభన.
Also Read : ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
ఒకప్పుడు హీరోయిన్స్ కి షూటింగ్ సమయంలో ఇంత ఇబ్బంది ఉండేది. ఇక అవుట్ డోర్ షూటింగ్స్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటన జరిగిన సమయానికి శోభన మన టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గానే కొనసాగుతూ ఉంది. అలాంటి ఆమెకే బాలీవుడ్ మొదటి చిత్రం లో ఇలాంటి అనుభవం ఎదురు అయ్యిందంటే, ఇక కొత్తగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టం గానే అనిపిస్తుంది. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటికీ ఈ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి చెక్ ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇకపోతే శోభన చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అని చెప్పొచ్చు.