Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi Opportunity : కన్నప్పలో మంచు విష్ణు నాకు అందుకే అవకాశం ఇవ్వలేదు... ఓపెన్...

Manchu Lakshmi Opportunity : కన్నప్పలో మంచు విష్ణు నాకు అందుకే అవకాశం ఇవ్వలేదు… ఓపెన్ అయిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi Opportunity : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు కాగా, కథను మంచు విష్ణు స్వయంగా రాసుకోవడం విశేషం. కన్నప్ప ఇప్పటికే వాయిదా పడింది. జూన్ 27న థియేటర్స్ లోకి రానుంది. మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో ఆయన పాల్గొంటున్నారు. ఇక కన్నప్ప మూవీ బడ్జెట్ వందల కోట్లు అని ఆయన తేల్చారు. మంచు విష్ణుకు ఉన్న మార్కెట్ రీత్యా ఇది రిస్క్ అని చెప్పాలి. అయితే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయడం కలిసొచ్చే అంశం.

అదే విధంగా కన్నప్ప మూవీ కంటెంట్, రిచ్ మేకింగ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, విజయం అందిస్తుందనే నమ్మకంతో మంచు విష్ణు ఉన్నారు. కాగా కన్నప్ప మూవీ భారీ క్యాస్ట్ తో తెరకెక్కుతుంది. ఇక మంచు ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నప్ప మూవీలో నటించడం విశేషం. హీరోగా మంచు విష్ణు చేస్తుండగా, మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు నటిస్తున్నారు. నటులైన మంచు మనోజ్, మంచు లక్ష్మి మాత్రమే మిస్ అయ్యారు. కన్నప్ప మూవీలో మంచు లక్ష్మికి అవకాశం ఇవ్వకపోవడం పై ఆమె స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో మంచు లక్ష్మి..అడ్డంగా దొరికిపోయిందిగా!

నాకు కన్నప్ప లో అవకాశం ఎందుకు ఇవ్వలేదో మీరు మంచు విష్ణును అడగాలి. నేను కన్నప్పలో నటిస్తే మిగతా నటులు ఎవ్వరూ కనిపించరు(సరదాగా). నేను చేయగలిగిన పాత్ర కన్నప్పలో ఉండకపోవచ్చు. అందుకే మంచు విష్ణు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అన్ని సినిమాల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ నటిస్తే అది మా కుటుంబ చిత్రం అవుతుంది.. అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా సోదరులకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మంచు లక్ష్మి అన్నారు. కొన్నాళ్లుగా మంచు కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయి. మంచు మనోజ్-మంచు విష్ణు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

మంచు మనోజ్ కి మంచు లక్ష్మి మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి తన మకాం ముంబైకి మార్చింది. ఆమె కూతురితో పాటు అక్కడే ఉంటున్నారు. త్వరలో మంచు లక్ష్మి ఓ క్రేజీ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరోవైపు మంచు విష్ణు భైరవం మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version