Star Heroine Comments : ఒకప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈ హీరోయిన్ గా స్టార్ట్డం సంపాదించుకున్న ముద్దుగుమ్మలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆడిషన్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు కొంతమంది ఉంటే మరి కొంతమంది ఊహించని విధంగా సినిమాలలో హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు. ఒక స్టార్ హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాన్ని ఎలా అందుకుందో తెలిపింది. ఆమె ఒక దర్శకుడిని కలుద్దాం అని వెళ్లి హీరోయిన్ గా అవకాశం అందుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం అందుకోవాలి అంటే ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. కొంతమంది చాలా కష్టాలు పడినా కూడా వాళ్లకు అవకాశాలు రావడం చాలా అరుదు. అలాగే మరి కొంతమంది మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే సినిమాలలో హీరోయిన్గా అవకాశం అందుకున్నారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకుంటారు. అలాగే బుల్లితెర మీద సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.
కానీ కొంతమందికి మాత్రం అదృష్టం తలుపు తట్టి ఊహించని విధంగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కూడా చాలామంది హీరోయిన్ గా అవకాశము అందుకుంటున్నారు. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తనకు సినిమాలలో వచ్చిన అవకాశం గురించి తెలుపుతుంది. ఆమె తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడిని చూద్దాం అని వెళితే ఆమెను ఏకంగా హీరోయిన్ చేసేసారట. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో కూడా త్రిష షూటింగ్ వెళ్లడానికి వెళితే ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసిన సన్నివేశం అందరికీ దాదాపు గుర్తుండే ఉంటుంది. స్టార్ హీరోయిన్ సమంతకు కూడా సరిగ్గా అలాగే జరిగిందట. సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే ఒక ఫ్యాషన్ లో వెల్కమ్ గర్ల్ గా ఉండేది. ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
గతంలో సమంత ఒక సందర్భంలో తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఆ విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ సమంతకు దర్శకుడు గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు అంటే కూడా సమంతతో చాలా పిచ్చి అట. సమంత ఒకసారి ఆ దర్శకుడిని చూద్దామని షూటింగ్ కి వెళ్ళిన సమయంలో ఊహించని విధంగా తాను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందట. ఏం మాయ చేసావే సినిమా ఆడిషన్స్ సమయంలో సమంత ఎలాగైనా సరే తనకు చాలా ఇష్టమైన దర్శకుడిని చూడాలని ఆ ఆడిషన్స్ లో పాల్గొంది. దర్శకుడిని చూసి వస్తే చాలు అనుకున్న సమంతకు ఆ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.