https://oktelugu.com/

Game Changer : ఎల్లుండి ‘గేమ్ చేంజర్’ రిలీజ్..ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు..అసలు ఏమి జరుగుతుంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం ఎల్లుండే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కానీ అభిమానులు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 11:38 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎల్లుండే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కానీ అభిమానులు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇచ్చేసారు. కానీ తెలంగాణ లో మాత్రం ఇంకా ఆ అనుమతి రాలేదు. అందుకే నిర్మాత దిల్ రాజు అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర లో కూడా అప్పుడే ప్రారభించవద్దు అని, తెలంగాణ తో పాటు ఒకేసారి బుకింగ్స్ ప్రారంభిద్దాం అని చెప్పాడట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టికెట్ హైక్స్ కి, అదే విధంగా బెనిఫిట్ షోస్ కి అనుమతిని కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    కాసేపట్లో దీనిపై క్లారిటీ రావొచ్చు. ప్రభుత్వం నుండి ఇందుకోసం జీవో కూడా విడుదల కానుంది. దీని కోసమే మేకర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ కర్ణాటక తో పాటు నార్త్ ఇండియా, తమిళనాడు లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మొత్తం మీద ఇండియా వైడ్ గా ఇప్పుడు ఉన్న షోస్ మీద మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ‘దేవర’ , ‘పుష్ప 2 ‘ చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన రెండు రోజులకు కేవలం హైదరాబాద్ నుండే 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి ‘గేమ్ చేంజర్’ కి ఆ రేంజ్ బుకింగ్స్ జరుగుతుందా అంటే ప్రస్తుతానికి కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే వీటికి 5 రోజుల ముందే బుకింగ్స్ ప్రారంభించారు. మరోపక్క ఓవర్సీస్ లో కూడా నిన్నటి నుండే పూర్తి స్థాయి బుకింగ్స్ ని ప్రారంభించారు.

    కేవలం ఒక్క లండన్ ప్రాతం నుండే ఈ సినిమాకి 30 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా 50 వేలకు పైగా టికెట్స్ ని అమ్ముకోవచ్చు అని అంటున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 80 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. నార్త్ అమెరికా లో ఐమాక్స్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు మొదలయ్యాయి. ఈ ప్రాంతం నుండి కేవలం ప్రీమియర్ షోస్ కి 15 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 45 లక్షల డాలర్లు రావాలి. కేవలం వీకెండ్ తోనే ఆ మార్కుని దాటేస్తామని అభిమానులు బలమైన నమ్మకంతో చెప్తున్నారు.