Priyanka Mohan: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2019లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాతో ఈమె సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక శ్రీకారం అనే సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు విజయం సాధించడంతో ఆమెకు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఎందుకో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో సరైనా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇదిలా ుంటే తమిళంలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అమ్మడు.
ప్రస్తుతం తెలుగులో కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది ప్రియాంక మోహన్. ఈ సారి తన అదృష్టం బాగున్నట్టుగా ఉంది. టాలీవుడ్ మూవీ మేకర్స్ దృష్టి అంతా కూడా ఈ అమ్మడు పైనే ఉందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని సంపాదించింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఏ ముహూర్తాన ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో కానీ అప్పటి నుంచి ఈమె దశ తిరిగిందనే చెప్పాలి.
తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈమెకు ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా లేదనేది వాస్తవం. అయినా కూడా ప్రస్తుతం పవన్ సరసన నటించడంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని సరసన సరిపోదా శనివారం సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాత్రమే కాదు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగో సినిమాలో కూడా నటించనుంది ఈ అమ్మడు.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు ప్రియాంకను కలిశారని తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాతో ఈ అమ్మడు దశ తిరిగిందని అర్తం అవుతుంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..