Bigg Boss 7: స్టార్ మా ఛానల్ లో ప్రతి ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇప్పటి వరకు ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, 5 సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.కానీ ఆరవ సీజన్ మాత్రం ఫ్లాప్ అయ్యింది.

సెలెబ్రిటీలు ఆడియన్స్ కి పెద్ద ముఖ పరిచయం లేనోళ్ళు అవ్వడం, దానికి తోడు ఎలిమినేషన్స్ అన్నీ కూడా ప్రభిప్రాయానికి విరుద్ధం గా ఉండడం వల్లే ఆరవ సీజన్ సక్సెస్ కాలేదని విశ్లేషకులు చెప్పే మాట.అందుకే ఈ ఏడాది టెలికాస్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్టార్ మా ఛానల్.ఈ సీజన్ లో పాల్గొనబోయ్యే కంటెస్టెంట్స్ అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితమైన వాళ్లనే ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇది వరకే ఈ సీజన్ లో భార్యాభర్తల జంటలు ఎక్కువగా పాల్గొంటున్నారనే న్యూస్ చాలా రోజుల క్రితమే వచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే వాళ్ళతో పాటుగా, ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న యాంకర్స్ మరియు సినిమాల్లో ఒకటి రెండు సక్సెస్ లు అందుకొని మాయపొయినా కుర్ర హీరోయిన్స్ ని కూడా ఈ షోలో పాల్గొనే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ‘ఈషా రెబ్బ’ కోసం బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈషా రెబ్బ , రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోయిన్స్ కారణంగా ఆమె డిమాండ్ బాగా పడిపోయింది.ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, అందుకే ఆమెని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే ఆమెని సంప్రదించారట.ఆమె కూడా అందుకే పాజిటివ్ గానే స్పందించిందని టాక్.
ఈమెతో పాటుగా పలువురు కుర్ర హీరోయిన్స్ తో కూడా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్.మరో నెల రోజుల్లో సీజన్ 7 లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి ఒక కచ్చితమైన రిపోర్ట్ వస్తుందని తెలుస్తుంది.సీజన్ 6 పరాజయాన్ని మూటగట్టుకున్న బిగ్ బాస్, సీజన్ 7 తో బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.