
Hot Mail : హాట్ మెయిల్ సహా వ్యవస్థాపకుడు సబీర్ భాటియా హాట్ కామెంట్స్ చేశాడు. భారతదేశం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా లేదని వ్యాఖ్యానించాడు.. ఉద్యోగాలను సృష్టించాలనుకుంటే భారత్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా మెరుగుపరచాలని ఆయన వివరించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ఆకర్షించేందుకు మేము విజయవంతం అయ్యామని, అది లక్ష ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలదని ఆయన వివరించాడు.. అంతేకాదు భారత్ తన విద్యా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని సూచించాడు. ఇప్పుడున్న గ్లోబల్ మార్కెట్ ప్రకారం భారత్ లో అనుసరిస్తున్న విద్యా విధానాలు ఏ మాత్రం సరిపోవని, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారు దేశమైన భారత్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలని సబీర్ ఆకాంక్షించారు.. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే భారత్ ఇంకా వెనుకబడి ఉండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు..” 100 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశం అత్యంత వేగంగా ఆవిష్కరణలు చేయలేకపోతోంది.. దీనివల్ల జనాభా అవసరాలు తీరడం లేదు.. ఇంకా ఇతర దేశాల సాంకేతికతపై ఆధారపడటం భారతదేశాన్ని ఆర్థికంగా కుంగదీస్తోంది. ఎంతోమంది యువత ఉన్న భారత్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం” అని సబీర్ వ్యాఖ్యానించాడు.. భారత్ సరళికృత ఆర్థిక విధానాలతో పాటు, సరళీకృత విద్యావిధానాన్ని అవలంబించాలని ఆయన నొక్కి వక్కానించాడు.
ఇక సబీర్ బాటియా భారత్ మూలాలు ఉన్న అమెరికన్ దేశస్థుడు. 1996లో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జాక్ స్మిత్ తో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఉచిత ఆధారిత ఈమెయిల్ సర్వీస్ అయిన హాట్ మెయిల్ వ్యవస్థాపకుడిలో ఒకడు.. ఐఎస్పీ ఆధారిత ఈమెయిల్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒకరి ఇన్ బాక్సును యాక్సిస్ చేయగల సామర్థ్యాన్ని వినియోగదారులకు అందించాడు. 90వ దశకం చివరిలో ఉన్నప్పుడు హాట్ మెయిల్ కు పది మిలియన్ల సభ్యులు ఉండేవారు. ఈ స్టార్టప్ ను మైక్రోసాఫ్ట్ 1998లో 500 మిలియన్ డాలర్లను వెచ్చించి కొనుగోలు చేసింది. అప్పటినుంచి సబీర్ భాటియా వివిధ స్టార్టప్ కంపెనీలకు సలహాలు ఇస్తున్నాడు. వాటిలో పెట్టుబడులు పెడుతున్నాడు. వర్ధమాన వ్యాపారవేత్తలకు మార్గదర్శకం వహిస్తున్నాడు. గత ఏడాది తన కొత్త ప్లాట్ పామ్ షో రీల్ ను ప్రారంభించాడు. ఇది పూర్తి వీడియో రెస్యూమ్ ప్లాట్ ఫారం. ఇది ఆయా వ్యక్తులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది వీడియో, విజువల్ రూపంలో ఉండటంతో యువత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.