Pushpa: The rule: ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియన్ సినిమాలలో, దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’.2021 వ సంవత్సరం లో విడుదలై పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.పార్ట్ 1 ఎవ్వరూ ఊహించని స్థాయిలో హిట్ అవ్వడం తో, పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ ని డెవలప్ చెయ్యడం కోసం సుకుమార్ సుమారుగా ఏడాదిపాటు సమయం తీసుకున్నాడు.

అభిమానులు ప్రేక్షకులు రెండవ భాగం ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నారో, అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్ ని తయారు చేసాడట సుకుమార్.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది.ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు అనే సంగతి అందరికీ తెలిసిందే.
ఆ రోజున ‘పుష్ప: ది రూల్’ టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది మూవీ టీం.ఇది దాదాపుగా ఖరారు అయ్యిపోయినట్టే అని టాక్, త్వరలోనే ట్విట్టర్ లోని ‘మైత్రి మూవీ మేకర్స్’ హ్యాండిల్ నుండి అధికారిక ప్రకటన చేయబోతున్నారట.నాలుగు యాక్షన్ షాట్స్ తో పాటుగా, పుష్ప లో ‘తగ్గేదే లే ‘ డైలాగ్ ని ఈ టీజర్ లో పొందుపర్చబోతున్నారట.ఇక అదే రోజు అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘దేశముదురు’ సినిమాని 4K కి మార్చి ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేయబోతున్నారట.
ఈ సినిమా ఇంటర్వెల్ సమయం లో ‘పుష్ప: ది రూల్’ టీజర్ ని కూడా అటాచ్ చేస్తారట.ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.ఎందుకంటే పుష్ప సినిమా అప్డేట్స్ కోసం వాళ్ళు సుమారుగా ఏడాదికి పైగా ఎదురు చూసారు,ఆ ఎదురు చూపులకు తెరదించుతూ ఇప్పుడు వరుసగా అవార్డ్స్ రావడం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.