https://oktelugu.com/

ఫ్యూచర్ కోసం తెలుగు హీరోయిన్ కాంప్రమైజ్ !

అచ్చ తెలుగు అమ్మాయి కాబట్టి హీరోయిన్ అయిన కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో కాస్త మొహమాట పడింది ఈషా రెబ్బా. దాంతో అనుకున్నంత స్పీడ్ గా ఈషా కెరీర్ సాగలేదు. నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాల హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికి కూడా అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయితే ఈషా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే తన వైపు నుండి అన్ని […]

Written By:
  • admin
  • , Updated On : May 4, 2021 / 01:08 PM IST
    Follow us on

    అచ్చ తెలుగు అమ్మాయి కాబట్టి హీరోయిన్ అయిన కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో కాస్త మొహమాట పడింది ఈషా రెబ్బా. దాంతో అనుకున్నంత స్పీడ్ గా ఈషా కెరీర్ సాగలేదు. నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాల హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికి కూడా అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయితే ఈషా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

    కాకపోతే తన వైపు నుండి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నా… ఆమెను ఆదరించలేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అందుకే ఈషాలో గత ఏడాది నుండి చాల మార్పు వచ్చింది. గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు కూడా చేసింది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేస్తానంటూ దేనికైనా సై అంది. పైగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది.

    పైగా రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ నెటిజన్లతో పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కానీ నిత్యం టచ్ లో ఉంటోన్నా.. మిగితా హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ తెలుగు బ్యూటీకి, ఫాలోవర్స్ కూడా పెరగడం లేదు. అందుకే తన ఇన్స్టా ఖాతా నిండా తన అందాలను నింపుతూ ముందుకు పోతుంది. తనలోని గ్లామర్ ను హైలైట్ అయ్యేలా ఫోటోలు తీయించుకుని వాటినే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

    మరోపక్క నెటిజన్లు కూడా ఈషా పెట్టే పోస్ట్ లను ఎంజాయ్ చేస్తూ.. ఆమెను టీజ్ చేసున్నారు తప్ప, అమ్మడిని మాత్రం ఎంకరేజ్ చెయ్యట్లేదు. ఏది ఏమైనా తనలోని హాట్ హాట్ షోతో ఈషా మంటలు పెడుతూ పోతుంది. మరి ఈ హాట్ షోలతోనైనా ఈషా ఫ్యూచర్ బాగుంటుందేమో చూడాలి. కొత్త ప్రాజెక్టులు వస్తే గానీ అమ్మడు కెరీర్ ఊపందుకోదు.