Ee Nagaraniki Emaindi: నేటి తరం యూత్ ఆడియన్స్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది'(E Nagaraniki Emaindi). తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. అప్పట్లో ఈ సినిమాకు మంచి రివ్యూస్ అయితే వచ్చాయి కానీ, కమర్షియల్ గా మాత్రం యావరేజ్ రేంజ్ లోనే థియేటర్స్ లో ఆడింది. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత. అయితే 2023 వ సంవత్సరం లో ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ బాబు మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది. రెస్పాన్స్ సెన్సేషనల్ గా వచ్చింది. మొదటిసారి విడుదలైనప్పుడు వచ్చిన వసూళ్లకంటే, రెండవసారి విడుదలైనప్పుడు వచ్చిన వసూళ్లు ఎక్కువ అంటే, ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత యూత్ ఆడియన్స్ ఎంతలా అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం లో ముందుగా విశ్వక్ సేన్ ని హీరో గా అనుకోలేదట. నేచురల్ స్టార్ నాని తో ఈ చిత్రాన్ని చెయ్యాలని తరుణ్ భాస్కర్ అనుకున్నాడట. నాని కి కథ వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందట, కానీ ఈ కథని నాతో చేయడం కంటే, కొత్త వాళ్ళతో చేయడం బెటర్ అని నాని సూచించాడట. తెలిసిన ముఖాలతో సినిమా కాకుండా, కొత్త ముఖాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే, కథ కి తగ్గట్టుగా ఆడియన్స్ ఫ్రెష్ నెస్ ఫీల్ అవుతారని, ఒకసారి అలోచించి చూడమని నాని చెప్పాడట. అప్పుడు విశ్వక్ సేన్ సీన్ లోకి రావడం జరిగింది. ఒకవేళ నాని ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే, మొదటి రిలీజ్ లోనే ఈ చిత్రానికి మంచి రీచ్ వచ్చి ఉండేదా అంటే అవుననే చెప్పాలి.
ఇప్పుడంటే నాని పెద్ద రేంజ్ సినిమాలు చేస్తున్నాడు కానీ, అప్పట్లో నాని పక్కింటి కుర్రాడు పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఆయన ఈ సినిమా ఒప్పుకొని చేసుంటే, కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ నాని చెప్పింది కూడా కరెక్టే, ఈ సినిమాని చూసిన తర్వాత విశ్వక్ సేన్ తప్ప ఆ పాత్రని ఎవ్వరూ చెయ్యలేరు అనే విధంగా ఉంది. ఆ రేంజ్ లో ఆయన ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యాడు. ఒకవేళ నాని ఈ సినిమాని చేసుంటే కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళేదేమో, కానీ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని మాత్రం సొంతం చేసుకొని ఉండేది కాదు. ‘ఈ నగరానికి ఏమైంది’ అనేది యువతకి ఒక అందమైన జ్ఞాపకం, దీని సీక్వెల్ ని తరుణ్ భాస్కర్ అదే రేంజ్ లో తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.