https://oktelugu.com/

Sita Ramam Collections: 32వ రోజు కూడా ‘సీతా రామం’కి సంచలన వసూళ్లు.. ఇది సరికొత్త రికార్డు

Sita Ramam Collections: హీరో ‘దుల్కర్‌ సల్మాన్’కి తెలుగులో మళ్ళీ మరో భారీ హిట్ పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో యుద్ధంతో రాసిన ఈ ప్రేమ‌క‌థ పరిస్థితి బాగుంది. అసలు ఇంతకీ, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, ౩౦వ రోజు ఏ స్థాయిలో […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 01:25 PM IST
    Follow us on

    Sita Ramam Collections: హీరో ‘దుల్కర్‌ సల్మాన్’కి తెలుగులో మళ్ళీ మరో భారీ హిట్ పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో యుద్ధంతో రాసిన ఈ ప్రేమ‌క‌థ పరిస్థితి బాగుంది. అసలు ఇంతకీ, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, ౩౦వ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది ? చూద్దాం రండి.

    dulquer salmaan

    ముందుగా ‘సీతా రామం’ 32 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Karthikeya 2 Collections: 25వ రోజు కూడా బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ‘కార్తికేయ 2’.. క్రేజీ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

    నైజాం 9.79 కోట్లు

    సీడెడ్ 1.91 కోట్లు

    ఉత్తరాంధ్ర 3.56 కోట్లు

    ఈస్ట్ 1.97 కోట్లు

    వెస్ట్ 1.27 కోట్లు

    గుంటూరు 1.68 కోట్లు

    కృష్ణా 1.77 కోట్లు

    నెల్లూరు 0.90 కోట్లు

    ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 32 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 22.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 45.71 కోట్లు వచ్చాయి. ఇక 32వ రోజు 7 లక్షలను కలెక్ట్ చేసింది.

    రెస్ట్ ఆఫ్ ఇండియా 2.84 కోట్లు

    ఓవర్సీస్ 7.13 కోట్లు

    మిగిలిన వెర్షన్లు 8.09 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 32 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 41.98 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 83.92 కోట్లను కొల్లగొట్టింది. 32వ రోజు విషయానికి 11 లక్షలు కలెక్ట్ చేసింది. నిజంగా ఇది రియల్లీ గ్రేట్ అనుకోవచ్చు.

    dulquer salmaan

    ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. అసలు ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలను పెద్దగా చూడటం లేదు. కానీ.. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరించడం విశేషమే. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.23.91 కోట్ల లాభాలను అందించింది.

    Also Read:Pawan Kalyan- Paruchuri Gopalakrishna: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే చేయాల్సింది అదే.. లెజెండరీ రైటర్ క్రేజీ కామెంట్స్.. సంబరాల్లో జనసైనికులు !

    Tags