Sita Ramam Movie Trailer: ‘దుల్కర్ సల్మాన్’… కేరళలో కలెక్షన్ల విలయతాండవం సృష్టించిన నేటి హీరో. ఇప్పుడు మలయాళ పెద్ద సినిమాల పెద్ద హీరో అంటే దుల్కర్ సల్మానే. అందుకే, దుల్కర్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అయితే దుల్కర్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా నిర్మాతల నిర్మాణంలో రాబోతున్న సినిమా ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ ఈ సినిమా ట్యాగ్ లైన్.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ అయ్యింది. ’20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకు ఒక బాధ్యత అప్పగించాడు’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ను, అలాగే కథలోని డిఫరెంట్ నేపథ్యాలను మరియు వైవిధ్యమైన పాత్రలను కూడా ట్రైలర్ లో చాలా బాగా పరిచయం చేశారు. ‘నేను ఇక అనాథను కాదు కదా’ అంటూ దుల్కర్ సల్మాన్ చివర్లో చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ ట్రైలర్ లో లవ్ అండ్ ఎమోషన్స్ తో బాగా ఆకట్టుకుంది.
Also Read: Maa TV- Sudigali Sudheer: మాటీవీ… మీరైనా సుధీర్ టాలెంట్ ని సరిగా వాడుకోండి
ఇక ఈ ట్రైలర్ లో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేసింది. అలాగే, బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్, మిగిలిన పాత్రల్లో గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ లు కూడా మెప్పించారు. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్రను కూడా ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు డబుల్ అయ్యాయి. యుద్ధ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నాడు. దుల్కర్ కి జోడీగా సీత పాత్రలో మృణాళిని ఠాకూర్ నటిస్తున్నది. కశ్మీర్ ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌గా రష్మిక మందన్న కీలకమైన పాత్రను పోషిస్తున్నది.
ప్రేమకథల్ని తనదైన శైలి సున్నిత భావోద్వేగాలతో తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి చాలా టాలెంటెడ్. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Also Read:Liger Movie: షాకింగ్..లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
[…] Also Read: Sita Ramam Movie Trailer: ట్రైలర్ టాక్ : ప్రేమతో రాసిన… […]
[…] Also Read: Sita Ramam Movie Trailer: ట్రైలర్ టాక్ : ప్రేమతో రాసిన… […]