Dulquer Salmaan: మలయాళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్ (Dulkar Salaman)..తెలుగులో సైతం వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక రీసెంట్గా ఆయన తెలుగులో చేసిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా భారీ సక్సెస్ ని సైతం కట్టబెట్టింది. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ముద్ర సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు… మమ్ముట్టి (Mammutty) కొడుకుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన నటుడిగా సైతం తన పూర్తి పొటేషియాల్టీని చూపిస్తూ ఒక్కో పాత్రకి ప్రాణం పోస్తున్నాడు. అందువల్లే అతన్ని ఇష్టపడే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో దుల్కర్ సల్మాన్ కి బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలు చాలా చూశానని చెప్పాడు.
Also Read: నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?
మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుత జనరేషన్ లో ఉన్న హీరోల్లో ఎలాంటి పాత్రనైనా సరే చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న అతి కొద్ది మంది నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు…
పాజిటివ్ క్యారెక్టర్ అయిన, నెగిటివ్ క్యారెక్టర్ అయిన పాత్ర ఏదైనా సరే తను తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. లక్కీ భాస్కర్ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయి. ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎలాంటి బరువు బాధ్యతలు ఉంటాయి అనే పాత్రను స్క్రీన్ మీద చాలా బాగా నటించి మెప్పించాడు.
మొత్తానికైతే ఆయన ఒక అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక తెలుగు సినిమా హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానని పలు సందర్భాల్లో తెలియజేశాడు…