Nayanthara: మలయాళ భామ నయనతార కోలీవుడ్ వేదికగా స్టార్డం తెచ్చుకుంది. కెరీర్ బిగినింగ్ లో ఆమె చేసిన చంద్రముఖి, గజినీ హీరోయిన్ గా నిలబెట్టాయి. కోలీవుడ్ లో ఆమెకు భారీ ఫేమ్ ఉంది. లేడీ సూపర్ స్టార్ గా చెప్పుకుంటారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు నయనతార కేరాఫ్ అడ్రస్ గా మారింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఎంతటి పేరుందో.. అదే స్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. నయనతార కెరీర్లో అనేక వివాదాలు ఎదుర్కొంది. నయనతార శింబు, ప్రభుదేవాలతో బహిరంగంగా ప్రేమాయణం నడిపింది. వారితో బ్రేక్ అయ్యాక దర్శకుడు విగ్నేష్ శివన్ కి దగ్గరైంది. ఆయన్ని వివాహం చేసుకుంది.
Also Read: బయ్యర్స్ ని భయపెట్టి పంపిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
తిరుమల దేవస్థానం పరిసరాల్లో చెప్పులతో సంచరించి ఓ వివాదంలో చిక్కుకుంది. క్షమాపణలు కోరడంతో టీటీడీ వదిలేసింది. ఇక సరోగసి ద్వారా ఇద్దరు కుమారులకు జన్మను ఇవ్వడం కూడా వివాదమైంది. లీగల్ గానే సరోగసీతో పిల్లలను పొందినట్లు నిరూపించుకున్న నయనతార దంపతులు, ఎంక్వరీ నుండి బయటపడ్డారు. ధనుష్ తో నయనతారకు ఒక సీరియస్ డిస్ప్యూట్ నడిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే నయనతార జీవితంలో చాలా వివాదాలు ఉన్నాయి.
నయనతారపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ ఆమె ప్రమోషన్స్ కి హాజరుకారు. షూటింగ్ పూర్తి అయ్యే వరకే తన బాధ్యత, ప్రమోషన్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటుంది. ఎంత పెద్ద స్టార్ అయినా ఇందుకు మినహాయింపు కాదు. చివరికి ఆమె ప్రధాన పాత్ర చేసిన చిత్రాల విషయంలో కూడా నయనతార ఇదే పద్దతి ఫాలో అవుతుందనే వాదన ఉంది. అయితే చిరంజీవి సినిమా విషయంలో నయనతార తన పాలసీ పక్కన పెట్టింది. షూటింగ్ కూడా మొదలు కాకుండానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అనిల్ రావిపూడి ఆమె మీద స్పెషల్ ప్రోమో షూట్ చేశాడు. నయనతార సదరు ప్రోమోలో ఎనర్జిటిక్ గా కనిపించింది. కీలకమైన విడుదలకు ముందు ప్రమోషన్స్ కి కూడా డుమ్మా కొట్టే నయనతార, షూటింగ్ కి ముందే ప్రమోషనల్ ప్రోమో చేయడం షాక్ ఇచ్చింది. ఆమె మారిపోయారా? లేదా చిరంజీవి కోసం మాత్రమే చేశారా? అనే చర్చ జరుగుతుంది. ఇక సినిమాను జనాల్లో తీసుకెళ్లడంలో అనిల్ రావిపూడి కింగ్ అనిపిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ కి ఆయన రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో చాలా ఉపకరించాయి.
