Vijay-Junior NTR : తమిళ్ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు నెల్సన్ (Nelsan)…ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా తనదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన రజనీకాంత్ తో చేసిన జైలర్ (Jailer) మూవీ పాన్ ఇండియా సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు జైలర్ 2 (Jailer 2) సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే తన తదుపరి సినిమాల మీద భారీ అంచనాలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న నెల్సన్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో చేస్తున్న ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందంటూ ఇప్పటినుంచే అంచనాలైతే మొదలయ్యాయి…ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ఏంటి అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
Also Read : ‘పంజా’ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ రేంజ్ కి వెళ్లిందో చూస్తే నోరెళ్లబెడుతారు!
నిజానికి నెల్సన్ జైలర్ 2 (Jailer 2) తర్వాత విజయ్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ విజయ్(Vijay)పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన ఆ కథను చేయలేకపోయాడు. దాంతో ఆ కథని జూనియర్ ఎన్టీఆర్ (NTR) తో చేయాలని నెల్సన్ నిర్ణయించుకొని తనకి కథను చెప్పి ఒప్పించాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్ లో డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన నెల్సన్ సినిమా కోసం రంగం సిద్ధం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా ఆయనకు భారీ సక్సెస్ దక్కుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.