Dulquer Salmaan: కేరళలో కరోనా విలయతాండవం చేసింది. అందుకే, అక్కడ సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. ఒక విధంగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన మలయాళ పెద్ద సినిమా ‘కురుప్’ మాత్రమే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి, స్వయంగా నిర్మించిన చిత్రం ఇది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించింది.

రిలీజ్ కి ముందే సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో, ఈ సినిమాకు అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మలయాళ వెర్షన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. ఒక్క మలయాళంలోనే కాదు, తెలుగునాట కూడా ఈ చిత్రానికి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసింది.
ఈ సినిమాతో పాటు వచ్చిన మిగిలిన రెండు తెలుగు చిత్రాల కన్నా.. కురుప్ కే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అటు తమిళనాడులోనూ గత వీకెండ్ ఎక్కువ కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది ‘కురుప్’. మొత్తానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రాష్ట్రాల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకడు.

మొత్తానికి దుల్కర్(Dulquer Salmaan) ఇప్పుడు పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా నిలిచాడు. దీనికి తోడు ఇప్పుడు ‘కురుప్’ సాలిడ్ హిట్ తో దుల్కర్ సల్మాన్ స్టార్ డమ్, అండ్ మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ఎందుకంటే తన కురువు తో మొదటిసారి అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా దుల్కర్ భారీ కలెక్షన్లను రాబట్టి అక్కడ కూడా తనకంటూ ఓ మార్కెట్ సృష్టించుకున్నాడు.
ఇక ప్రస్తుతం దుల్కర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా నిర్మాతల నిర్మాణంలో ఓ తెలుగు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏది ఏమైనా కురుప్ లాంటి ఒక్క హిట్ తో దుల్కర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.