https://oktelugu.com/

Liger: లైగర్​ షూటింగ్​లో మైక్​ టైసన్​తో విజయ్​ ​.. నెట్టింట్లో పిక్​ వైరల్​

Liger: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా ఎంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 12:22 PM IST
    Follow us on

    Liger: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్​ ఛాంపియన్​ మైక్​ టైసన్​ను ఈ సినిమా కోసం బరిలోకి దించారు.

    తాజాగా మైక్​ టైసన్​ ఈ సినిమా షూటింగ్​లో పాల్గొన్నారు. ప్రస్తుతం లైగర్​ టీమ్​ అమెరికాలోని లాస్​వేగాస్​లో షూటింగ్​ జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే దేవరకొండ, మైక్​ టైసన్​ల మధ్య కీలక సన్నివేశాలను తెరక్కకిస్తున్నారు పూరి. ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు విజయ్​. తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిపోయే క్షణం ఇదంటూ విజయ్​ అన్నారు. తొలిసారి ఐరన్​ మ్యాన్​ను కలిసిన వేళ అంటూ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం మైక్​టైసన్​తో కలిసి విజయ్ దిగిన ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది.

    మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. మైక్​టైసన్​, విజయ్​ల మధ్య ఎపిసోడ్​లు సినిమాకు ప్రధాన హైలెట్​గా నిలుస్తాయని తెలుస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది.