Dude Movie Review : ‘లవ్ టుడే’,’డ్రాగన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన చిత్రం ‘డ్యూడ్'(Dude Movie). అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్, ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లేందుకు పెద్ద ప్రణాళిక వేసుకున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా అదిరిపోయాయి. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ని చూడబోతున్నాము అనే ఫీలింగ్ కలిగించింది ఈ ట్రైలర్. ప్రదీప్ సినిమాల్లో మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు క్లైమాక్స్ లో యూత్ కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్లాన్ చేశారు.
ఈ ప్రివ్యూ షోకి మీడియా ప్రముఖులతో పాటు, కొన్ని ప్రాంతాల బయ్యర్స్ కూడా వచ్చారు. ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళ నుండి వచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని చూస్తుంటే, ప్రదీప్ ఈ సినిమాతో తమిళనాడు స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోతాడు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉందని టాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ తో నిండిపోయింది అట. హీరో క్యారక్టర్ తో పాటు, హీరోయిన్ క్యారక్టర్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్, దానిని అనుసరిస్తూ వచ్చే సెకండ్ హాఫ్ యూత్ ఆడియన్స్ మనసులకు బాగా దగ్గరయ్యే విధంగా ఉంటుందట. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ లో వచ్చిందని, యూత్ ఆడియన్స్ కొన్నేళ్లు గుర్తించుకుంటారని, అంత ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు.
ప్రదీప్ సినిమాలను యూత్ ఆడియన్స్ చూసి తమని తాము వెండితెర పై చూస్తున్నట్టుగా భావిస్తారు. అలాంటి సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా కూడా అలాంటిదే అని అంటున్నారు. పాటలు ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయట. ఓవరాల్ గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందని అంటున్నారు. ప్రివ్యూ షో లో చెప్పిన టాక్, ఆడియన్స్ నుండి కూడా విడుదలయ్యాక వస్తే, కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, లాభాల్లోకి అడుగుపెడుతుంది బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రదీప్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు టాక్ వస్తే వీకెండ్ కి వంద కోట్ల గ్రాస్ ని రాబడుతుందని, అంతటి కెపాసిటీ ఈ చిత్రానికి ఉందని అంటున్నారు, చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.