Akhanda 2 Thaman BGM : తమిళ సినిమా ఇండస్ట్రీ కి అనిరుద్ ఎలాగో, మన టాలీవుడ్ కి థమన్(SS Thaman) అలాగా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడంటే, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యినట్టే అనుకోవాలి. సన్నివేశం తో సంబంధం లేకుండా, కేవలం తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లడం థమన్ లో ఉన్న స్పెషాలిటీ. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఈ సినిమాకు ఎవరూ తక్కువ కాదు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ మరియు థమన్, ముగ్గురికి ముగ్గురు దుమ్ము దులిపేసారు. ముఖ్యంగా ఆ సినిమా టైటిల్ కార్డు నుండి ఎండింగ్ కార్డు పడే వరకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమధ్య కాలం లో ఇలాంటి మ్యూజిక్ ఔట్పుట్ ని ఎక్కడా చూసి ఉండరు ఆడియన్స్.
ఇక దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ‘తెలుసు కదా’ చిత్రానికి కూడా చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బాలయ్య తో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ‘అఖండ’ నుండి ‘డాకు మహారాజ్’ చిత్రం వరకు థమన్ బాలయ్య కి ఎలాంటి మ్యూజిక్ ని అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన కొట్టిన మ్యూజిక్ కి థియేటర్స్ లో DTS బాక్సులు కాలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రేంజ్ లో దున్నేశాడు. ఇక ‘అఖండ 2’ అంటే ఏ రేంజ్ ఎఫోర్ట్స్ పెడుతాడో మనం ఊహించే ఉండుంటాము. కానీ థమన్ మన ఊహలకు అందని రేంజ్ మ్యూజిక్ ని ఈ చిత్రానికి అందించబోతున్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేకమైన సెటప్ కూడా చేసుకున్నాడు. అఖండ 2 అనేది భక్తిరస మాస్ చిత్రం.
ఇది ఒక డిఫరెంట్ జానర్ కాబట్టి, థమన్ డిఫరెంట్ సౌండింగ్ కోసం సనాతన ధర్మం సాహిత్యాన్ని అనుసరించే కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు. వాళ్ళతో ఆయన చేయించిన ఒక కోరస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూస్తుంటే ఈసారి థమన్ తన వైపు నుండి నూటికి నూరు శాతం కాదు, నూటికి రెండు వందల శాతం ఎఫోర్ట్స్ ని పెడుతున్నాడని అనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా తో థమన్ తన మ్యూజిక్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. దీపావళి నుండే ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్.