Dude Movie Collection Day 2: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్యూడ్'(Dude Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ తెలుగు,తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ హీరో ప్రదీప్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ వరకు దుమ్ము దులిపేసింది. కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఆయన గత రెండు చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండు భాషల్లోనూ ఈ చిత్రం మొదటి రోజుకంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రాంతాల వారీగా ఈ చిత్రం రెండు రోజులకు కలిపి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కోటి 50 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక తమిళనాడు ప్రాంతం లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చాయి. మొదటి రోజున ఈ చిత్రానికి 6 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబడితే, రెండవ రోజు ఏకంగా 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది ఈ చిత్రం. కానీ ఓవర్సీస్ లో మాత్రం మొదటి రోజు కంటే కాస్త డ్రాప్స్ ని సొంతం చేసుకుంది అనే చెప్పాలి. మొత్తం మీద రెండవ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రెండు రోజులకు కలిపి 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసే సమయానికి 50 కోట్ల రూపాయలకు దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుండి బుధవారం వరకు తమిళనాడు లో దీపావళి సెలవలు ఉండడం తో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలబడబోతోంది. ఇదే తరహా స్టడీ రన్ ని కొనసాగిస్తే, వచ్చే రెండవ వీకెండ్ లోపు ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఒక సామాన్య యువకుడు, మొదటి మూడు చిత్రాలతో వరుసగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు, ఇదొక చరిత్ర అనుకోవచ్చు.