Hero Vishal: తెలుగు,తమిళ భాషల్లో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకడు విశాల్(Vishal Reddy). ఒకప్పుడు ఈయన సినిమాలకు మన టాలీవుడ్ ఆడియన్స్ ఎగబడి వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది, ఓపెనింగ్స్ కూడా తెలుగులో భారీగా వచ్చేవి. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్ సినిమాల కారణంగా మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలు చేసినప్పటికీ కూడా, విశాల్ కి పూర్వ వైభవం రాలేదు అనేది వాస్తవం. ఈమధ్య కాలంలో ఆయన నుండి ఎలాంటి సినిమా రాలేదు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన గ్యాప్ ని మైంటైన్ చేస్తున్నాడు. ‘డిటెక్టివ్ 2’ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టాడు కానీ, దీని స్టేటస్ ఏంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే విశాల్ ‘యువర్స్ ఫ్రాంక్లీ విశాల్’ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లో అత్యంత కష్టమైన చిత్రం ‘అవన్ – ఇవన్’. బాలా గారు దర్శకత్వం వహించిన ఏ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాను. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను కూడా చూడాల్సి వచ్చింది. మళ్లీ ఇలాంటి క్యారక్టర్ లో చెయ్యాలని అనుకోవడం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఒప్పుకోను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అవార్డుల గురించి విశాల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ‘నేను అవార్డ్స్ ని పెద్దగా పట్టించుకోను. ఒక నటుడి నటన ది బెస్ట్ అనేది కేవలం 8 మంది జ్యూరీ సభ్యులు ఎలా నిర్ణయిస్తారు?. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా వచ్చే అవార్డుకే నేను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాను. నాకు వచ్చే అవార్డ్స్ ని చెత్తబుట్టలో పడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ నాకొచ్చిన అవార్డు బంగారం తో చేయించింది అయితే, దానిని అమ్మేసి చారిటీ కి డొనేట్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.
చాలా లాజిక్ గా మాట్లాడాడే అంటూ విశాల్ ని సమర్థిస్తూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలం లో అర్హతలు లేని వాళ్ళు కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. అవార్డు కి విలువే లేకుండా పోయింది. ఇలాంటి అవార్డ్స్ ని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎందుకు పెట్టకూడదు?. గతంలో సైమా అవార్డ్స్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టం ని పూర్తిగా రద్దు చేశారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అవార్డు తీసుకుంటే, సదరు నటీనటులకు వచ్చే తృప్తి సాధారణమైనది కాదు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేషనల్ అవార్డు అయినా, స్టేట్ అవార్డు అయినా, ఫిల్మ్ ఫేర్ అవార్డు అయినా,సైమా అవార్డు అయినా, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అందిస్తే బాగుంటుందని నెటిజెన్స్ నుండి వ్యక్తం అవుతున్న అభిప్రాయం.