Telusu Kada Collection Day 2: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటించిన ‘తెలుసు కదా'(Telusu Kada Movie) చిత్రం రీసెంట్ గానే విడుదలై ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒక సెక్షన్ ఆడియన్స్ కి ఈ చిత్రం బాగా నచ్చడం తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా వెళ్తున్నారు. ఉదాహరణకు నైజాం ప్రాంతం లో ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫర్మ్ చేస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున నైజాం ప్రాంతంలో 90 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నైజాం తో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ థియేట్రికల్ రన్ ఉంది. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమాకు ఇప్పటి వరకు మూడు లక్షల డాలర్లు వచ్చాయట. వీకెండ్ పూర్తి అవ్వగానే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంటుందని అంటున్నారు.
ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన షేర్ వసూళ్లను పరిశీలిస్తే, బ్రేక్ ఈవెన్ మార్కుకి ఆమడ దూరం లో ఉందని చెప్పొచ్చు. నైజాం ప్రాంతం లో మొదటి రెండు రోజులకు కలిపి కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంద్ర ప్రదేశ్ లో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి 4 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి పాతిక లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 3 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈరోజు, రేపు, ఎల్లుండి సెలవులు కావడం తో మరో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్లడం దాదాపుగా అసాధ్యమే. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం జాక్ కంటే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ కోసమే 20 కోట్లకు పైగా ఖర్చు చేసి ఉంటారు. కేవలం హీరోయిన్స్ అయినటువంటి రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు. మొత్తం పోయినట్టే.