https://oktelugu.com/

డ్రగ్స్: టాలీవుడ్ మూలాలు వెలుగులోకి..

సుశాంత్‌ సింగ్‌ కేసులో ‘అనుబంధంగా’ వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నట్టు సమాచారం.  నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను  అరెస్టు చేశారు. సినీరంగానికి చెందిన వారితో ఇతడు శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు మంచి బిజినెస్‌ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్‌ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో […]

Written By: , Updated On : September 7, 2020 / 03:36 PM IST
Drugs

Drugs

Follow us on

Drugs in tollywoodసుశాంత్‌ సింగ్‌ కేసులో ‘అనుబంధంగా’ వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నట్టు సమాచారం.  నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను  అరెస్టు చేశారు. సినీరంగానికి చెందిన వారితో ఇతడు శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు మంచి బిజినెస్‌ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్‌ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్‌ పార్టీల్లో వీటి వినియోగం ఎక్కువ.

ఈ డ్రగ్స్‌ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టిపీడిస్తోంది. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు… టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్‌ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన వారేనని సమాచారం. డ్రగ్స్‌ వినియోగం టాలీవుడ్‌కు బాలీవుడ్‌ నుంచే పాకింది. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్‌ బాబీ, ప్రోతిమా బేడీ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడిగా ఉన్నాడు. ఫర్దీన్‌ ఖాన్‌ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు. అప్పుడు పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్‌ డ్రగ్స్‌ తరలిస్తూ అబుధాబి పోలీసులకు చిక్కాడు.

ప్రముఖ నటుడు రవితేజ సోదరులైన బి.రఘుబాబు, భరత్‌రాజ్‌ను వెస్ట్‌జోన్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులు గతంలో ఓసారి పట్టుకున్నారు. వారిని విచారించగా చాలా మంది సినీ తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్లు, లేడీ యాక్టర్స్‌, క్యారెక్టర్‌‌ ఆర్టిస్టులను విచారించారు. కొద్ది రోజులు హడావిడి చేసిన పోలీసులు తర్వాత కేసును పక్కన పడేశారు.

ఈ డ్రగ్స్ ఉత్పత్తులు కొన్ని చెట్ల నుంచి ఉత్పత్తి అవుతాయి. కొన్ని  ఉత్పత్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సరఫరా అవుతున్నాయి. అక్కడ పండే గంజాయితో పాటు చెరస్, హషీష్‌ ఆయిల్‌కు సినీ రంగంలో మంచి డిమాండ్‌ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఓపియం సహా దాని ఉత్పత్తులైన బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌ల చలామణి తక్కువ. ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చండీగడ్‌ల్లో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వీరి నెట్‌వర్క్‌లో నైజీరియన్లదే కీలకపాత్ర.