Also Read : కేసీఆర్ సంచలనం.. వీఆర్వో వ్యవస్థ రద్దు
కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మరో సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది.
రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ మార్పులు చేయడానికి కేసీఆర్ నడుం బిగించినట్టు సమాచారం. తెలంగాణలో రెవెన్యూశాఖలో అంతులేని అవినీతి బయటపడుతున్న సంగతి తెలిసిందే. వీఆర్వోలు, ఎమ్మార్వోల నుంచి కలెక్టర్ల దాకా లింకులు బయటపడుతున్నాయి. దీంతో కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వో అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించనుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఎమ్మార్వోలకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది. గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ లకు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో 141 సబ్ రిజిస్టార్ ఆఫీసులున్నాయి. కొన్ని చోట్ల పెంచుకొని.. గ్రామీణ ప్రాంతాల్లో 20 వరకు ఆఫీసులను తగ్గించే ఆలోచనలో ఉంది.
Also Read : దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి అతడేనా?