చైనా గ్రేట్‌.. : పునర్వియోగ వ్యోమ నౌక సక్సెస్‌

చైనా యాప్స్‌ని బ్యాన్‌ చేసిన మనం.. చైనా వస్తువులను ఇంకా బ్యాన్‌ చేయలేకపోతున్నాం. ఎలక్ర్టానిక్స్‌ విషయంలో చైనాకు తిరుగులేదనే చెప్పాలి. కంప్యూటర్స్‌.. మొబైల్స్‌.. ఏ రంగంలోనైనా కాపీ చేస్తూ సక్సెస్‌ అయిన చైనా.. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. రెండురోజుల క్రితం చైనా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్ష నౌక సక్సెస్‌గా ల్యాండ్‌ అయింది. ఆగ్నేయ చైనాలోని జిక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌తో ఈ వ్యోమ నౌకను ప్రయోగించగా.. రెండు […]

Written By: NARESH, Updated On : September 7, 2020 2:58 pm

china

Follow us on

చైనా యాప్స్‌ని బ్యాన్‌ చేసిన మనం.. చైనా వస్తువులను ఇంకా బ్యాన్‌ చేయలేకపోతున్నాం. ఎలక్ర్టానిక్స్‌ విషయంలో చైనాకు తిరుగులేదనే చెప్పాలి. కంప్యూటర్స్‌.. మొబైల్స్‌.. ఏ రంగంలోనైనా కాపీ చేస్తూ సక్సెస్‌ అయిన చైనా.. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. రెండురోజుల క్రితం చైనా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్ష నౌక సక్సెస్‌గా ల్యాండ్‌ అయింది. ఆగ్నేయ చైనాలోని జిక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌తో ఈ వ్యోమ నౌకను ప్రయోగించగా.. రెండు రోజుల పాటు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన ఈ నౌక తిరిగి భూమిపైకి చేరింది.

తక్కువ ఖర్చుతో శాంతియుత ప్రయోజనాల కోసం ఈ వ్యోమనౌక ప్రయోగం ముఖ్య ఉద్దేశమట. అయితే, దీనికి సంబంధించిన ఎలాంటి ఫొటో కానీ.. వివరాలను కానీ చైనా బహిర్గతం చేయలేదు. అమెరికా గతంలో ప్రయోగించిన మానవరహిత పునర్వినియోగ వ్యోమనౌక ఎక్స్‌-37బీ తరహాలోనే ఇదీ ఉంటుందని అధికారులు చెప్పినట్లు కేవలం మీడియా తెలిపింది. ఇప్పటివరకూ ఎక్స్‌-37బీ నాలుగు మిషన్లలో పాలుపంచుకుంది. ప్రపంచ దేశాలు ఆధారపడుతున్న అమెరికా దిక్సూచి వ్యవస్థ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌)కు పోటీగా తయారు చేస్తున్న బీడో నావిగేషన్‌ సిస్టం ప్రాజెక్టును చైనా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రావడానికి అవసరమైన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.

మూడేళ్ల కిందట చైనా అధికారికి మీడియా జున్హూ ఓ కథనం ప్రచురిస్తూ.. ఈ ఏడాది పునర్వినియోగ వ్యోమనౌకను చైనా ప్రయోగించనుందని తెలిపింది. అంతేకాదు, ఇది సంప్రదాయ వ్యోమనౌకలకు భిన్నంగా ఉంటుందని, యుద్ధ విమానం మాదిరిగా అంతరిక్షంలోకి దూసుకెళ్తుందని వివరించింది. ఎక్స్-37బీ ఆరో మిషన్ ప్రారంభించిన తరువాత మే చివరి నుంచి కక్ష్యలో ఉందని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్‌షీట్ తెలిపింది. మానవరహిత వ్యోమనౌకను భూకక్ష్యకు తక్కువ ఎత్తులో ప్రయోగించేలా రూపొందించారు. ఇది దీర్ఘకాలిక అంతరిక్ష సాంకేతిక ప్రయోగం, పరీక్షలకు ఉపయోగపడుతుందని.. రన్‌వే ల్యాండ్ అవుతుంది’ అని వైమానిక దళం పేర్కొంది.

సరిగా అది చెప్పినట్లే ఇప్పుడు తాజాగా సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. ఇన్నాళ్లు డమ్మీ వస్తువులను తయారీ చేస్తూ తక్కువ ధరలకు విక్రయించిన చైనా.. ఇప్పుడు అంతరిక్షంలోనూ విజయం సాధించడంతో సంబరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడించకపోవడంపై అనుమానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.